ఎంపీ ధర్మపురి అరవింద్‌ను కలిసిన నారపాక అశోక్

జగిత్యాల, ధనాధన్ న్యూస్ : నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ నాయకుడు ధర్మపురి అరవింద్‌ను బీజేపీ ఎస్సీ మోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షుడు నారపాక అశోక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లాలో బీజేపీ ఎస్సీ మోర్చాను మరింత బలోపేతం చేయడంతో పాటు, దళిత వర్గాలను పార్టీకి మరింత చేరువ చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.ప్రత్యేకంగా బీర్‌పూర్ మండలంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, గ్రామస్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేయడం, ప్రజా సమస్యల పరిష్కారానికి […]

జగిత్యాల అర్బన్ బీజేపీ ఓబీసీ మోర్చా జనరల్ సెక్రెటరీగా సల్ల రమేష్

జగిత్యాల, ధనాధన్ న్యూస్ : జగిత్యాల అర్బన్ మండల భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఓబీసీ మోర్చా జనరల్ సెక్రెటరీగా సల్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు అర్బన్ మండల బీజేపీ అధ్యక్షుడు దణ్ణపునేని నరేష్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, దీర్ఘకాలంగా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ, బీసీ వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న సల్ల రమేష్ సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు […]

నడికూడ యువత గొంతుగా పని చేస్తా

నడికూడ,ధనాధన్ న్యూస్ : నాపై నమ్మకం,విశ్వాసం ఉంచి నడికుడ మండల బీజేవైఎం అధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పగడాల కాళీ ప్రసాద్,రావు పద్మ, హనుమకొండ జిల్లా బీజేవైఎం అధ్యక్షులు,నా ఆత్మీయ మిత్రుడు పున్నం వేణు, హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు కోలాను సంతోష్ రెడ్డి,నడికూడ మండల బీజేపీ అధ్యక్షులు ఎరుకల దివాకర్ లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు,భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు,ఆశయాలు, దేశభక్తి స్ఫూర్తితో యువతను ఏకం చేస్తూ,కార్యకర్తలతో కలిసి పార్టీ బలోపేతానికి కృషి […]

వృద్ధాప్య, బీడీ కార్మికుల పెన్షన్లు కూడా ఇవ్వాల్సిందే..!

ఇల్లందకుంట,ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన 420 హామీలలో భాగంగా వృద్ధాప్య, బీడీ కార్మికుల పెన్షన్లను కూడా వెంటనే అమలు చేయాలని ఇల్లందకుంట మండల బీజేపీ సీనియర్ నాయకులు మట్ట పవన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గత ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల పెన్షన్లను పెంచి ఇస్తామని హామీ ఇచ్చిందని, కానీ రెండున్నరేళ్లు గడిచినా పెన్షన్ల పెంపుపై […]

బీసీ బిడ్డ ఈశ్వరమ్మ యాదవ్‌పై చేసిన వ్యాఖ్యలకు శివచరణ్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి: దొంతరవేన రమేష్ యాదవ్

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యురాలిగా నియమితులైన బీసీ మహిళ పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్‌పై యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉప సర్పంచ్‌ల ఫోరం జమ్మికుంట మండల అధ్యక్షుడు దొంతరవేన రమేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీసీ మహిళను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరమని అన్నారు. జక్కిడి శివచరణ్ రెడ్డి వెంటనే పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్‌కు, యాదవ జాతికి, […]

కేంద్రమంత్రి బండి సంజయ్ ముందస్తు జన్మదిన వేడుకలు

ఇల్లందకుంట,జూలై 10 (ధనాధన్ న్యూస్): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ 55వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఇల్లందకుంట మండలంలోని కనగర్తి గ్రామ జెడ్పీహెచ్‌ఎస్ (ZPHS) పాఠశాలలో శుక్రవారం ముందస్తు జన్మదిన వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు, బండి సంజయ్ కుమార్ వీరాభిమాని మట్ట పవన్ రెడ్డి ఆధ్వర్యంలో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా […]

తాడిచెర్ల కోల్ బ్లాక్-2ను సింగరేణికి కేటాయింపు

న్యూఢిల్లీ, జూలై 8 (ధనాధన్ న్యూస్): తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తాడిచెర్ల కోల్ బ్లాక్-2ను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్)కు కేటాయించాలంటూ పెద్దపల్లి లోక్‌సభ సభ్యుడు  చేసిన నిరంతర కృషి ఫలించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాడిచెర్ల కోల్ బ్లాక్-2ను ఎస్‌సీసీఎల్‌కు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది.ఈ అంశంపై ఎంపీ వంశీకృష్ణ గడ్డం ఈ ఏడాది ఫిబ్రవరి 3న కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కి అధికారికంగా లేఖ రాసి, తెలంగాణ […]

ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఆకుల రాజేందర్‌కు ఘన సన్మానం

జమ్మికుంట,జూలై 1 (ధనాధన్ న్యూస్): కరీంనగర్ జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఆకుల రాజేందర్‌ను జమ్మికుంట మండల మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం నాయకులు బుధవారం ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. శాలువాతో సత్కరించి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఎబూషి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆకుల రాజేందర్ సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే నాయకుడని అన్నారు. బీసీ వర్గాల సమస్యలను నిరంతరం ప్రభుత్వ దృష్టికి […]

ఎమర్జెన్సీకి భయపడలేదు..జైలులోనూ ఆర్ఎస్ఎస్ శాఖలు నిర్వహించాం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్,జూన్ 25: దేశంలో 1975లో విధించిన ఎమర్జెన్సీ సమయంలో ఆర్ఎస్ఎస్‌పై నిషేధం విధించినప్పటికీ తాము వెనుకడుగు వేయలేదని, జైలులో కూడా ఆర్ఎస్ఎస్ శాఖలను నిర్వహించామని ఆ సంఘం సీనియర్ కార్యకర్తలు తెలిపారు.జమ్మికుంటకు చెందిన మంతెన శ్రీమన్నారాయణ, హుజురాబాద్‌కు చెందిన కొమురవెల్లి సదానందం మాట్లాడుతూ, ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడామని చెప్పారు. హిందూ ధర్మ పరిరక్షణ, దేశ శాంతి భద్రతల కోసం కార్యకర్తలుగా పనిచేస్తూ ప్రభుత్వ నిర్బంధాలను ఎదుర్కొన్నామని, సుమారు మూడు నెలల పాటు […]

ఆకునూరు పాఠశాలలో స్వచ్ఛ పాఠశాల – స్వచ్ఛ భారత్ కార్యక్రమం

సైదాపూర్/ధనాధన్ న్యూస్,జూన్ 13: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా సైదాపూర్ మండలంలోని ఆకునూరు ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం “స్వచ్ఛ పాఠశాల – స్వచ్ఛ భారత్” కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా హుస్నాబాద్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ గుర్రాల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పాఠశాల ఆవరణ, తరగతి గదులు, డ్రైనేజీలను శుభ్రపరిచి, చెత్తాచెదారం, కలుపు మొక్కలను తొలగించినట్లు పేర్కొన్నారు. […]