ఓట్ల కోసం భార్య బిడ్డలతో భిక్షాటన చేసిన కౌశిక్ రెడ్డికి మాట్లాడే అర్హత లేదు

By dhanadhannews.com

  • పిసిసి సభ్యులు పత్తి కృష్ణారెడ్డి
మీడియా సమావేశం లో కృష్ణా రెడ్డి.

హుజురాబాద్,ధనాధన్ న్యూస్:

ఓట్ల కోసం భార్య బిడ్డతో భిక్షాటన చేయించి ఎన్నికల్లో గెలిచావని పీసీసీ సభ్యులు పత్తి కృష్ణారెడ్డి ఆరోపించారు.గురువారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ పై నిరాదరణ మైన ఆరోపణలు చేస్తే ఊరుకునేలేదని భౌతిక దాడులు చేయడానికి తాము సిద్దమైన అని ఆయన అన్నారు.ఇంట్లో గౌరవంగా బ్రతకాల్సిన గృహినితో బిక్షాటన చేయించిన నీకు ఇతరులపై విమర్శలు చేసే అర్హత లేదని తెలిపారు. ఎన్నికల ముందు నీ పరిస్థితి ఏ విధంగా ఉందో ఇప్పుడు ఏ విధంగా ఉందో హుజురాబాద్ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.కుటుంబ సభ్యులతో కలిసి చచ్చిపోతానని బెదిరించడం వల్లే నీకు ఓట్లు వేశారు కానీ నీ మీద అభిమానంతో కాదని స్పష్టం చేశారు.నీ గెలుపు కోసం నీవు చేసిన నీచపు రాజకీయాలను ప్రస్తావిస్తే మంత్రిపై అసత్యపు ఆరోపణ చేయడం సిగ్గుచేటని అన్నారు.నువ్వు మాట్లాడిన మాటల్లో నిజం ఉందా అని ఆయన ప్రశ్నించారు.హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధి కోసం పాటుపడాల్సినపోయి మంత్రులపై అవాక్కులు చేవాక్కులు మాట్లాడడం సరి కాదని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొల్లూరి కిరణ్,పట్టణ అధ్యక్షులు సొల్లు బాబు, మహిళా కాంగ్రెస్ పట్టణ,మండల అధ్యక్షురాళ్ళు పుష్పలత,లావణ్య,మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షులు ఎండి అప్సర్,నాయకులు కిరణ్ రెడ్డి,కిరణ్ రెడ్డి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.