- విద్యార్థులు జీవన ప్రమాణాలు అలవర్చుకోవాలి
- అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
- ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతి ప్రధానం
- కరస్పాండెంట్ చైర్మన్ డాక్టర్ పుల్లూరి సంపత్ రావు
జమ్మికుంట,ధనాధన్ న్యూస్:
జమ్మికుంట పట్టణంలోని స్థానిక ఎంపిఆర్ గార్డెన్స్ లో లోటస్ పాండ్ పాఠశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చైర్మన్ డాక్టర్ పుల్లూరి సంపత్ రావు విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమం ప్రారంభించారు.విద్యార్థులను ఉద్దేశించి చైర్మన్ డా.పుల్లూరి సంపత్ రావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు జీవన నైపుణ్యాలను పెంచుకోవాలని అన్నారు.తల్లితండ్రులు కూడా వారికి ఎన్ని పనులు ఉన్న కొంత సమయాన్ని పిల్లలతో కూడా గడుపుతూ ఉన్నట్లయితే తల్లిదండ్రులపై సమాజంపై అవగాహన కలుగుతుందని అన్నారు.దీంతో భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి తోడ్పడుతుందన్నారు.విద్యార్థులకు రానున్న విద్యా సంవత్సరంలో మరింత మెరుగైన విద్యను అందించుటకు రెసిడెన్షియల్ అవకాశం కల్పిస్తున్నామని అన్నారు.అనంతరం పాఠశాలలో ప్రీ ప్రైమరీ పూర్తి చేసుకున్న యూకేజీ విద్యార్థులకి గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ని చైర్మన్ డాక్టర్ పుల్లూరి సంపత్ రావు అందించారు..వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలలో ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు,పాఠశాలలో అత్యధిక హాజరు శాతం ఉన్న విద్యార్థుల కు బహుమతి ప్రధానం చేశారు.ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు అనేక సాంస్కృతిక కార్యక్రమాలను విద్యార్థులను,తల్లిదండ్రులను ఆకట్టుకునేలా ప్రదర్శించారు.కేరళ రాష్ట్రపు కలాయిరిపట్టు, రైతుల పైన రూపొందించిన మైం షో,పేరెంట్స్ పై రూపొందించిన స్కిట్స్,వివిధ పాటలపై విద్యార్థుల నృత్యాలు అందరినీ అలరించాయి.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు శ్రీనివాస్ రావు,దయాకర్ రావు ఉపాద్యాయులు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
