వరి మొక్కజొన్న యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన

By dhanadhannews.com

సైదాపూర్ మండలంలోని
వెన్నంపల్లి గ్రామ రైతు వేదికలో మంగళవారం రోజున కేవీకే జమ్మికుంట శాస్త్రవేత్త శ్రీనివాస్ రెడ్డి  రైతులకు వరి మరియు మొక్కజొన్న పంటల ఎరువుల యాజమాన్యం,వాటిలో వచ్చు వివిధ రకాల పురుగులు,తెగుళ్ల యాజమాన్యం మీద అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది.డిడిఏ,ఎఫ్టిసి చత్రునాయక్  రైతులకు సేంద్రీయ వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం చేయడం వలన నేలకు,రైతుకు కలిగే లాభాల గూర్చి వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంఏవో వైదేహి,ఏఈవో రజిత గ్రామ రైతులు పాల్గొన్నారు.