సైదాపూర్ మండలంలోని గొడిశాల గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను చూడడానికి నేషనల్ రిమోట్ సెన్సింగ్ (ఎన్ఆర్ఎస్) నుండి జోషి, బూర్ల అనిల్ కుమార్ సైంటిస్టులు మరియు సిఆర్డి నుండి అభయ్ కుమార్ వచ్చారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఫారం పాండ్స్, భూగర్భ జలాల పెంపు,ఫీడర్ ఛానెల్స్, వ్యవసాయ సాగు పెరుగుదల, హరితహరం, గ్రామంలో చేపట్టిన హార్టికల్చర్ పండ్ల తోటలు,నర్సరీ,పల్లె ప్రక్రుతి వనాలు,ఇతర ఉపాధి హామీ పథకం పనులను సమీక్షించారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి యాదగిరి,ఏపీవో రాణి,ఈసి శ్రీధర్,టిఏలు మధు, అశోక్,పంచాయితీ సెక్రటరీ సుమన్,ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.ఎన్ఆర్ఎస్ సైంటిస్టులు గ్రామంలో చేపట్టిన పనుల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు.
