సైదాపూర్ మండలం:సైదాపూర్ మండల కేంద్రంలో కొత్త బస్ స్టాండ్ అవరణలో గురువారం రోజున వేసవి కాలం దృశ్య ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రతియేటా ఏర్పాటు చేసిన విధంగానే ప్రస్తుత సంవత్సరం కూడా జెఎస్అర్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి బస్టాండ్ వద్ద చల్లని నీటిని అందించేందుకు ఫ్రిజ్ లు ఏర్పాటు చేశారు.కూలింగ్ వాటర్ చలివేంద్రం ఏర్పాటు చేసి మండల కేంద్రానికి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చే జెఎస్అర్ సేవ భావానికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జంపాల సంతోష్,వెన్కెపల్లి బీజేపీ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ రెడ్డి,నాయకులు నెల్లి శ్రీనివాస్, సుదర్శనచారీ,రవి,వంగ సాగర్,ప్రయాణికులు గ్రామస్తులు ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
