సైదాపూర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని సర్వాయిపేట గ్రామంలో మాల సంఘం అధ్యక్షుడిగా వేలంగి ప్రేమ్ సాగర్ మూడవసారి మాల సంఘం అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.మాల సంఘం నాయకులు గ్రామ ప్రజలు సర్వాయిపేట మాల సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన వేలంగి ప్రేమ్ సాగర్ కు ఘనంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం వేలంగి ప్రేమ్ సాగర్ మాట్లాడుతూ మూడవసారి సర్వాయిపేట మాల సంఘం అధ్యక్షునిగా కొనసాగింపు పట్ల సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని ప్రతిక్షణం ప్రతి నిమిషం సంఘం కోసం సంఘం అభివృద్ధి కోసం కృషి చేస్తానని బాబా సాహెబ్ అంబేద్కర్ చూపిన దారిలో నడుస్తానని జాతి కోసం జాతి ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తానని తెలిపారు.
