నూజివీడు సీడ్స్ వారి నూతన విత్తన రకాల విడుదల

By dhanadhannews.com

కరీంనగర్/ధనాధన్ న్యూస్: నూజివీడు సీడ్స్ విజేత పత్తి మరియు సంధ్య వరి విత్తన సన్నరకాలతోనే అధిక లాభాలు చేకూరుతుందని సీనియర్ రీజినల్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కరీంనగర్ లో  ఆహా హోటల్లో విజేత పత్తి విత్తనం మరియు సంధ్య వరి విత్తనం సన్న రకాల ప్రోడక్ట్ లాంచింగ్ ప్రోగ్రాం డిస్ట్రిబ్యూటర్స్ మరియు డీలర్స్ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగినది .ఈ సందర్భంగా సీనియర్ రీజినల్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ నూజివీడు 50 వసంతాలు పూర్తిచేసుకుని రైతుల మనసులను పొందిన ఏకైక విత్తన సంస్థగా నూజివీడు సీడ్స్ అని కొనియాడారు.నూతన పత్తి విత్తనమైన విజేత రైతులకు అధిక లాభాలను చేకూరుస్తుందని అన్నారు. విజేత బిజీ II పత్తి విత్తనం ముఖ్య లక్షణాలను డిస్ట్రిబ్యూటర్స్ కి మరియు డీలర్స్ కి వివరించడం జరిగింది. ఈ పత్తి రకం అన్ని రకాల రసం పీల్చు పురుగులను సమర్థవంతంగా తట్టుకుంటుందని,త్వరగా కాపుకు వస్తుందని,పత్తి తీయడం సులభమని, ముందుగా కాపుకు రావడం వలన గులాబీ రంగు పురుగును తప్పించుకోవచ్చని తెలిపారు రైతుకు నమ్మకమైన దిగుబడి వస్తుందని తెలిపారు, ఇదే కార్యక్రమంలో సంధ్య నూతన  వరి వంగడాన్ని ఆవిష్కరించారు.ఈ రకము ఖరీఫ్ మరియు రబీకి అనుకూలమైన సన్న రకమని,అన్ని రకాల తెగుళ్లను తట్టుకుంటుంది,ఈ విత్తనం తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చని,గాలులకు పడిపోదని, రైతులు అధిక లాభాలు పొందుతారని తెలియపరిచారు.రైతుల కోసం నూజివీడు కంపెనీ నిరంతరం కొత్త వంగడాలను తీసుకురావడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో నూజివీడు సీడ్స్  డిస్ట్రిబ్యూటర్స్,డీలర్స్ మరియు కంపెనీ ప్రతినిధులు పాల్గొనడం జరిగింది