- కవ్వంపల్లి మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోం
- మానకొండూరు అభివృద్ధిని అడ్డుకుంటే ఉపేక్షించేది లేదు
- ఇందిరమ్మ ఇండ్ల పై రసమయి బాలకిషన్ చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలి
- రసమయి ఒక రాజకీయ బ్లాక్ మెయిలర్
- కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్
కరీంనగర్/ధనాధన్ న్యూస్: ఇందిరమ్మ ఇండ్ల పైన మానకొండూరు నియోజకవర్గం అభివృద్ధి పైన రసమయి బాలకిషన్ చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాపాలనలో మానకొండూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక రసమయి బాలకిషన్ ఒక పిచ్చి పట్టిన వ్యక్తిలా వ్యవహరిస్తున్నారని, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద నిరాధారమైన ఆరోపణలను చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని ప్రతి నియోజకవర్గానికి మొదటి విడత గా 3500 మంజూరు చేశారని దాదాపుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ముఖ్యంగా మానకొండూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పనులు ప్రారంభించారని, దమ్ముంటే నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామం చూపించాలని సవాల్ విసిరారు. కవ్వంపల్లి సత్యనారాయణ గారికి ప్రజల నుండి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక రసమయి బాలకిషన్ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఆయన ఆరోపిస్తున్న దాని ప్రకారం ఎక్కడైనా లబ్ధిదారుల వద్ద డబ్బులు తీసుకొని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్టు నిరూపిస్తే రాజకీయాలనుంచి తప్పుకుంటామని లేని పక్షంలో రసమయి బాలకిషన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
కేవలం 16 నెలల కాలంలో మానకొండూరు నియోజకవర్గం అభివృద్ధి ప్రదాతగా మారి అక్కడి ప్రజల మన్ననలు చూరగొంటున్న వ్యక్తి మంత్రి అయ్యే అవకాశానికి దగ్గరగా వెళ్తే అది జీర్ణించుకోలేని రసమయి బాలకిషన్ వ్యంగ్యంగా మాట్లాడుతూ వ్యక్తి ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నాడని తాను ఎమ్మెల్యేగా ఉన్న పది సంవత్సరాల కాలంలో మంత్రి కాదు కదా కనీసం రసమయి కి అప్పటి మంత్రులు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన తెలిపారు. దళిత ద్రోహిగా మారి దళితుల ఆత్మగౌరవాన్ని దొర దగ్గర తాకట్టు పెట్టి అనుక్షణం దళితులను మోసం చేసిన వ్యక్తి దళిత సమాజానికి ఏం సమాధానం చెప్తాడని ఆయన ప్రశ్నించారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దళితుల దగ్గర కమిషన్లు తీసుకొని దళిత బందు ఇచ్చిన వ్యక్తి, దళితుల మీద అక్రమ కేసులు పెట్టించిన వ్యక్తి, దళిత జాతి బిడ్డనని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు.
మానకొండూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి ముఖ్యంగా రోడ్లు, సుడానిధులతో జరుగుతున్న సుందరీకరణ పనులు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కళాశాల, టెక్నికల్ సెంటర్, SDF నిధులతో జరుగుతున్న అభివృద్ధి ఇవేవీ రసమయి బాలకిషన్ కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రసమయి బాలకిషన్ దుకాణం బంద్ అయిందని మానకొండూరు నియోజకవర్గ ప్రజలు ఆయనను పట్టించుకునే పరిస్థితిలో లేరని ఒక మతిభ్రమించిన వ్యక్తిగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ఇకమీదట ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని తీవ్రంగా మండిపడ్డారు.. గతంలో సాంస్కృతిక సారధి చైర్మన్ గా తెలంగాణ కోసం గజ్జ కట్టి పాటలు పాడిన కళాకారుల దగ్గర డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇప్పించిన చరిత్ర రసమయి బాలకిషన్దని అలాంటి వ్యక్తి కవ్వంపల్లి గారి మీద ఆరోపణలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని ఆయన అన్నారు. ఇక మీదట రసమయి బాలకిషన్ మా నాయకుడు కవ్వంపల్లి సత్యనారాయణ గారిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెన్న రాజమల్లయ్య, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు జేరిపోతుల వాసు, జిల్లా కన్వీనర్లు హస్తపురం రమేష్ , జుంజుపల్లి వివేక్ ,కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మీసాల సాయిలు, దుబ్బాసి కుమార్ ,మెరుగు సంపత్ , అంజయ్య, దావా ప్రభాకర్ ఎస్సీ సెల్ నాయకులు సముద్రాల అజయ్, ములకల కవిత, తిట్ల ఈశ్వరి, తంగేళ్ల కిరణ్, మంద మహేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు
