సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో గురువారం రోజున ఉదయం గ్రామంలోని విద్యార్థులను ప్రైవేట్ స్కూళ్లకి తీసుకుని వెళ్లడానికి వచ్చిన స్కూల్ బస్సులను, మోడల్ స్కూల్ బస్సును, మహిళలందరూ అడ్డుకొని, బస్సు వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించి మహిళలు ధర్నా చేసి,గ్రామంలోని విద్యార్థులను బస్సులో నుంచి దింపి విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ వెళ్లడానికి గల కారణాలు అడిగి తెలుసుకోని,విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మన గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించేటువంటి బాధ్యత మాదేనని మహిళలు అన్నారు, విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్న వాటికి నివృత్తి చేయడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని, అందుకోసం మన గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలని దీనితోపాటు మండలంలోని మొట్టమొదటి ర్యాంకులు సాధించిన మన దుద్దెనపల్లి ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాలని,విద్యార్థులకు ఎలాంటి లోటు లేకుండా ఇంగ్లీషులో మీడియంలో విద్యను బోధించడానికి ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారని, కానీ పాఠశాలలో విద్యార్థులు లేక పాఠశాల బోసిపోతున్నదని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మన గ్రామంలోని విద్యార్థులందరూ ప్రతి ఒక్కరు కూడా మన పాఠశాలలో చేరితే, విద్యార్థులకు అర్థమయ్యే విధంగా విద్యను బోధించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఉపాధ్యాయులు తెలియజేస్తున్నారు.మాన గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను కాపాడుకునే కార్యక్రమంలో ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు,గ్రామ పెద్దలు,మహిళలు,యువకులు ముందుకు రావాలని మహిళా మణులు కోరుతున్నారు.
