జమ్మికుంట/ధనాధన్ న్యూస్:జమ్మికుంట మండల కేంద్రంలో శ్రావణ్ రికార్డింగ్ స్టూడియో ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ప్రొప్రైటర్ పుల్లా శ్రీలత మీడియాతో మాట్లాడుతూ జమ్మికుంట పట్టణ, పరిసరాల ప్రాంత ప్రజల సౌకర్యార్థం అట్టహాసంగా, అత్యంత నూతన పరికరాలతో నేడు జమ్మికుంట బస్టాండ్ ఆవరణలో శ్రావణ్ రికార్డింగ్ స్టూడియో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు ఇకపై రికార్డింగ్ కొరకు దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేదని, అత్యంత మెరుగైన పరికరాలతో రికార్డింగ్ స్టూడియో ను అందుబాటులోకి తీసుకోవచ్చామని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా సర్పంచ్, వార్డు మెంబర్, ఎంపీటీసీ, జడ్పిటిసి, కౌన్సిలర్ అభ్యర్థుల పేర్లపై పాటలు రికార్డ్ చేసి ఇవ్వబడును అని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఓల్లాల వాణి తోపాటు ప్రముఖ గాయకులు దండేపల్లి రాజు, సతీష్, శ్రీధర్, అర్చన సంధ్య తదితరులు పాల్గొన్నారు.
