ఆధ్యాత్మిక సేవలకు గౌరవం..డా.నాగుల సత్యం గౌడ్‌కు జాతీయ పురస్కారం

ప్రజాకవి, తత్వవేత్త, ఆధ్యాత్మిక విశ్వ గురువు బ్రహ్మశ్రీ డాక్టర్ నాగుల సత్యం గౌడ్‌కు జాతీయ స్థాయి “ఆధ్యాత్మిక విజ్ఞాన జ్యోతి” పురస్కారం అందజేశారు.ఈ కార్యక్రమం కరీంనగర్‌లోని ఫిలిం భవన్‌లో ఘనంగా నిర్వహించారు.సామాజిక సేవ, ఆధ్యాత్మిక సేవ, రచనా రంగాల్లో ఆయన చేసిన కృషిని గుర్తించి ఈ అవార్డు ప్రదానం చేశారు.మానవ విలువల పరిరక్షణలో ఆయన చేస్తున్న సేవలు విశేషంగా నిలిచాయి.తెలుగు వెలుగు సాహితీ వేదిక, తెలుగు ఇండియన్ కల్చరల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, శ్రీ విరాట్ విశ్వకర్మ విజ్ఞాన ఆధ్యాత్మిక ధార్మిక కళాపరిషత్ సంస్థలు సంయుక్తంగా ఈ అవార్డును అందజేశాయి.


ఈ కార్యక్రమాన్ని పోలోజు రాజకుమార్ నిర్వహించారు.
ముఖ్య అతిథులుగా డా. వంగల శాంతి కృష్ణ చార్య, హాస్య నటుడు ఆర్ఎస్ నంద పాల్గొన్నారు.సామాజికవేత్తలు, న్యాయవాదులు, కవులు, రచయితలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
సత్యం గౌడ్‌కు పట్టు శాల కప్పి, మెడల్ ధరింపజేసి సన్మానించారు.
ఉగాది జ్ఞాపికను అందజేశారు.ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఆయన సేవలు అమూల్యమని కొనియాడారు.ఆధ్యాత్మిక జ్ఞానం సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.అనంతరం సత్యం గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మనసును నిర్మలం చేసుకోవాలని సూచించారు.


ప్రశాంతమైన జీవితం కోసం ఆధ్యాత్మిక చింతన అవసరమని అన్నారు.యువత, విద్యార్థులు సమాజ నిర్మాణంలో కీలకమని తెలిపారు.వారు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.ప్రతి ఒక్కరూ స్వార్థాన్ని వదిలి లోక కళ్యాణానికి కృషి చేయాలని సూచించారు.మనిషి మనిషికి సహకరించే దృక్పథం అవసరమని అన్నారు.కళాకారులు, కవులు, రచయితలను ప్రోత్సహించడం తన లక్ష్యమని తెలిపారు.వారిలోని ప్రతిభను వెలికి తీసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో గురువులు, కళాకారులు, రచయితలు, నటులు పాల్గొన్నారు.
సత్యం గౌడ్ సేవలు మరింత విస్తరించాలని పాల్గొన్నవారు ఆకాంక్షించారు.ఈ అవార్డు ఆయన సేవలకు గుర్తింపుగా నిలిచింది.

Leave a comment