

జమ్మికుంట/ధనాధన్ న్యూస్:
పెద్దంపల్లి గ్రామంలో సర్పంచ్ ఎగిత పద్మ కుమార్ అధ్యక్షతన “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” గ్రామసభను ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజల సమస్యలను గుర్తించి వాటికి తక్షణ పరిష్కారాలు చూపించడం ఈ సమావేశం ప్రధాన లక్ష్యంగా నిలిచింది.
ఈ సందర్భంగా సర్పంచ్ ఎగిత పద్మ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికను రాష్ట్రవ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేస్తున్నదని తెలిపారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని, ప్రతి కుటుంబానికి సంక్షేమ మరియు అభివృద్ధి పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గ్రామంలో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ గ్రామసభలో వివిధ శాఖల అధికారులు తమ తమ విభాగాలకు సంబంధించిన పథకాలు, సేవలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి సుమంత్, గ్రామ కార్యదర్శి ప్రదీప్, మాజీ ఉపసర్పంచ్ గూడూరి శ్రీనివాస్, వార్డు సభ్యులు రాజయ్య, ప్రవళిక, తిరుమల, లావణ్య, గణపతి రెడ్డి, అఖిల, ఏఈఓ రాజేష్, జీపీఓ సుమలత, ఎంపీపీ ఎస్ టీచర్ రాగిణి, అంగన్వాడి టీచర్ రమాదేవి, వివో అరుణ, వివో స్వప్న, ఆశ వర్కర్ స్వరూపతో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.