
జమ్మికుంట/ధనధాన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షుడిగా పుల్లూరి ప్రశాంత్‌ను నియమించారు. ఈ నియామకం పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ప్రశాంత్ మాట్లాడుతూ, వార్డ్ బూత్ అధ్యక్షుడిగా పనిచేసిన తనను పట్టణ అధ్యక్షుడిగా ఎంపిక చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించిన జిల్లా అధ్యక్షుడు కృష్ణరెడ్డి, పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు, మాజీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు శనిగరపు రవి తదితర నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తానని, ముఖ్యంగా ఎస్సీ వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని ప్రశాంత్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలకు ఇంటింటికీ చేరేలా ప్రచారం చేస్తానని ఆయన స్పష్టం చేశారు.