
జమ్మికుంట/ధనాధన్ న్యూస్,జూన్ 7: జమ్మికుంట మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం జమ్మికుంటలోని స్థానిక సాయి గార్డెన్‌లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిరి రవి ఆధ్వర్యంలో నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు తుమ్మ చందు అధ్యక్షతన ఎండి ముస్తఫా అధ్యక్షుడిగా, ఎర్రం రాజు, ఎండి అజార్ ఉపాధ్యక్షులుగా, దొడ్డే ఆంజనేయులు ప్రధాన కార్యదర్శిగా, సుంకరి రమేష్ కోశాధికారిగా, దేవరకొండ హరీష్ కార్యదర్శిగా, పొన్నగంటి విజయ్ కార్యవర్గ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.
కార్యక్రమానికి రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులతో పాటు జమ్మికుంట మండలం మరియు పరిసర మండలాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షులు, సీనియర్ ఫోటోగ్రాఫర్లు మరియు రంగానికి విశిష్ట సేవలందించిన పలువురు ఫోటోగ్రాఫర్లను సన్మానించి ఘనంగా సత్కరించారు.

అధ్యక్షుడు ఎండి ముస్తఫా మాట్లాడుతూ ఫోటోగ్రఫీ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ సమిష్టిగా కృషి చేస్తూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వృత్తిపరంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. యూనియన్ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ ప్రధాన కార్యదర్శి సిరి రవి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు తుమ్మ చందు, జిల్లా కోశాధికారి బొంగోని మధుసూదన్ గౌడ్ పాల్గొన్నారు. అలాగే హుజురాబాద్ మండల అధ్యక్షుడు తలకొక్కుల హరిప్రసాద్, వీణవంక మండల అధ్యక్షుడు సంగే మోహన్, కమలాపూర్ మండల అధ్యక్షుడు విడపు ప్రతాప్, ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు బోయిని నవీన్ కుమార్ తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.