అంతర్గాంలో మహిళలకు ఉచిత ఆటో ప్రయాణ సేవ ప్రారంభం

జగిత్యాల/ధనాధన్ న్యూస్ జూన్ 8: జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామంలో సర్పంచ్ కంటెస్టెడ్ అభ్యర్థి కోల భవాని-అరుణ్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మహిళల కోసం ఉచిత ఆటో ప్రయాణ సేవను సోమవారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మహిళలకు ఉచిత ఆటో ప్రయాణ సేవను ప్రారంభించి మాట్లాడారు. మహిళల సంక్షేమం, సౌకర్యాల కల్పనకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.
ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మహిళల ప్రయాణ సౌకర్యార్థం ఈ సేవను అందుబాటులోకి తీసుకువచ్చిన కోల భవాని-అరుణ్‌ను ఎమ్మెల్యే అభినందించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, మహిళలు, ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment