మాతృత్వానికి మానవత్వం జోడించిన ఓం శ్రీ సాయి హాస్పిటల్

జగిత్యాల, ఆగస్టు 3 (ధనాధన్ న్యూస్): వైద్యం అంటే కేవలం చికిత్స మాత్రమే కాదు.. సేవ, మానవత్వం, ఆప్యాయత కూడా కలిసినప్పుడే అది సంపూర్ణమవుతుంది. ఈ మాటలను నిజం చేస్తూ జగిత్యాల పట్టణంలోని ఓం శ్రీ సాయి హాస్పిటల్ ప్రసూతి సేవల్లో తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది.ఆస్పత్రిలో ప్రసవం కోసం వచ్చే ప్రతి తల్లికి, నవజాత శిశువుకు అవసరమైన వస్తువులతో కూడిన ఉచిత బేబీ కిట్‌ను అందజేస్తూ మాతృత్వానికి మధుర జ్ఞాపకాన్ని అందిస్తోంది.గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన కేసీఆర్ […]
నర్సింగాపూర్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా బక్కచెటి చిన్న గంగాధర్ ఎన్నిక

జగిత్యాల రూరల్/ధనాధన్ న్యూస్,ఆగస్టు 1: జగిత్యాల రూరల్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో శనివారం మున్నూరు కాపు సంఘం ఎన్నికలు నిర్వహించారు.ఈ ఎన్నికల్లో సంఘం అధ్యక్షుడిగా బక్కచెటి చిన్న గంగాధర్, ఉపాధ్యక్షుడిగా సకినాల శ్రీకాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడికి గ్రామంలోని మున్నూరు కాపు సంఘం సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ధనాధన్ న్యూస్ రిపోర్టర్ రాజు రెడ్డి వారికి అభినందనలు తెలుపుతూ, సంఘ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం సభ్యులు, […]
వర్షాలకు కూలిన ఇళ్లను పరిశీలించిన దావ వసంత సురేష్

జగిత్యాల/ధనాధన్ న్యూస్ (జిల్లా ప్రతినిధి రాజా రెడ్డి): సారంగాపూర్ మండలం పెంబర్ల గ్రామంలోని బుడగ జంగాల కాలనీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా స్వప్న, పరమేశ్, దుర్గేష్‌ల నివాస గృహాలు కూలిపోయాయి. ఈ ఘటనపై జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ సంఘటన స్థలాన్ని సందర్శించి కూలిన ఇళ్లను పరిశీలించారు.ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడిన ఆమె, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం తక్షణమే నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని […]
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

జగిత్యాల/ధనాధన్ న్యూస్ (జిల్లా ప్రతినిధి రాజా రెడ్డి): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడేందుకు అప్రమత్తంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆదేశించారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులతో గురువారం జూమ్ సమావేశం నిర్వహించి వర్షాల పరిస్థితిపై సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొనసాగించాలని […]
వర్షాలకు కూలిన ఇంటిని పరిశీలించిన మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి

జగిత్యాల/ధనాధన్ న్యూస్: సారంగపూర్ మండలంలోని పెంబట్ల, కోనపూర్ గ్రామాల్లో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇదే సమయంలో పెంబట్ల గ్రామానికి చెందిన పాస్తం స్వప్న, ఆమె సోదరులు పరమేష్, దుర్గేష్ నివాస గృహం భారీ వర్షాల కారణంగా పూర్తిగా కూలిపోయింది.ఈ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కూలిన ఇంటిని పరిశీలించిన అనంతరం మండల తహసీల్దార్ (ఎంఆర్ఓ), […]
అంగడిబజార్‌లో విషాదం.. విద్యుత్ షాక్‌తో ఆవు మృతి

జగిత్యాల/ధనాధన్ న్యూస్: జగిత్యాల పట్టణంలోని అంగడిబజార్‌లో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన విద్యుత్ మీటర్‌కు విద్యుత్ సరఫరా కొనసాగుతుండగా, సమీపంలోని చెట్ల ఆకులు తినేందుకు వచ్చిన ఓ ఆవు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది.ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లకుండా అడ్డుకోవడంతో మరింత ప్రమాదం తప్పింది. ఆవు స్థానంలో ఎవరైనా వ్యక్తి వెళ్లి ఉంటే తీవ్ర ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు […]
జగిత్యాల రైతు బజార్ వద్ద ట్రాఫిక్ సమస్యకు చెక్

జగిత్యాల,జూలై 13 (ధనాధన్ న్యూస్): జగిత్యాల పట్టణంలోని రైతు బజార్ ముందు రహదారిపై రైతులు కూరగాయలు విక్రయించడం వల్ల గత కొంతకాలంగా తీవ్ర ట్రాఫిక్ సమస్య నెలకొంది. ముఖ్యంగా విద్యానగర్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో పాటు, సమీపంలోని ఆసుపత్రులకు వెళ్లే రోగులు, అంబులెన్స్‌లు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ సమస్యపై స్పందించిన ట్రాఫిక్ ఎస్‌ఐ మల్లేశం సోమవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం వార్డు కౌన్సిలర్ అరవ లక్ష్మి, మున్సిపల్ సిబ్బందితో […]
యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగుల నల్లబ్యాడ్జీల నిరసన

జగిత్యాల, జూలై 7(ధనాధన్ న్యూస్): యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లోని కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ విభాగాల నిర్వహణను ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం టెండర్లు పిలవడాన్ని నిరసిస్తూ జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగులు మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీజీపీఈజేఏసీ (TGPEJAC) రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు జగిత్యాలలోని టీజీఎన్‌పీడీసీఎల్ (TGNPDCL) డివిజన్ కార్యాలయం ఆవరణలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలో […]
SIR ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించాలి: ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్

మెట్‌పల్లి,జూన్ 30(ధనాధన్ న్యూస్: మెట్‌పల్లి మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన SIR (Special Intensive Revision) ప్రక్రియపై అవగాహన సదస్సుల్లో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు. సత్తక్కపల్లి, రాజేశ్వరరావుపేట, చెర్లకొండాపూర్, జగ్గాసాగర్, ఆత్మనగర్, రామలచక్కపేట గ్రామాల్లో జరిగిన సమావేశాల్లో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, SIR ప్రక్రియలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పాల్గొని అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా కృషి చేయాలని సూచించారు. బూత్ స్థాయి […]
ఉద్యోగ విరమణ పొందిన ఎస్‌బీ డీఎస్పీ వెంకటరమణకు ఘన సన్మానం

జగిత్యాల,జూన్ 30(ధనాధన్ న్యూస్): జిల్లా స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) డీఎస్పీ వెంకటరమణ ఉద్యోగ విరమణ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని వీకేబీ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం ఘన వీడ్కోలు, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై వెంకటరమణను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, పోలీసు శాఖలో వెంకటరమణ ఎన్నో సంవత్సరాల పాటు అంకితభావం, నిజాయితీ, క్రమశిక్షణతో సేవలందించి […]
