భారీ వర్షానికి ఇళ్లు కూలి నిరాశ్రయమైన నిరుపేద కుటుంబం

కాటారం, జూలై 29(ధనాధన్ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన శ్రీరాముల మల్లయ్య ఇంటి గోడలు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూలిపోవడంతో కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గోడలు కూలిపోవడంతో ఇంటిలో నివసించడం ప్రమాదకరంగా మారి, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.ఈ ఘటనపై స్పందించిన ఎర్రగుంటపల్లి గ్రామ యువత, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి అత్యవసర ఆర్థిక సాయం అందించడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని […]

రాహుల్ గాంధీ అరెస్టు ఖండిస్తూ మహా ముత్తారంలో కాంగ్రెస్ నిరసన

మహా ముత్తారం,జూలై 23 (ధనాధన్ న్యూస్): ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ తదితరులను పోలీసులు నిర్బంధించడాన్ని ఖండిస్తూ మహా ముత్తారం మండలం యామన్‌పల్లి చౌరస్తాలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పక్కల సడవలి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు […]

ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం,పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు

శంకరపట్నం, జూలై 8 (ధనాధన్ న్యూస్): ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత  జన్మదిన వేడుకలు, ఎమ్మార్పీఎస్ ఉద్యమ సంస్థ ఆవిర్భావ దినోత్సవాన్ని శంకరపట్నం మండలంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.మండల కేంద్రంలోని కేశవపట్నంలో ఎమ్మార్పీఎస్ మండల శాఖ అధ్యక్షుడు కనుకుంట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో, అంబేద్కర్ నగర్ గ్రామంలో మండల ప్రధాన కార్యదర్శి యామునూరి నాగరాజు ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దళిత […]

SIR ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించాలి: ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్

మెట్‌పల్లి,జూన్ 30(ధనాధన్ న్యూస్: మెట్‌పల్లి మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన SIR (Special Intensive Revision) ప్రక్రియపై అవగాహన సదస్సుల్లో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు. సత్తక్కపల్లి, రాజేశ్వరరావుపేట, చెర్లకొండాపూర్, జగ్గాసాగర్, ఆత్మనగర్, రామలచక్కపేట గ్రామాల్లో జరిగిన సమావేశాల్లో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, SIR ప్రక్రియలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పాల్గొని అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా కృషి చేయాలని సూచించారు. బూత్ స్థాయి […]

ఉద్యోగ విరమణ పొందిన ఎస్‌బీ డీఎస్పీ వెంకటరమణకు ఘన సన్మానం

జగిత్యాల,జూన్ 30(ధనాధన్ న్యూస్): జిల్లా స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) డీఎస్పీ వెంకటరమణ ఉద్యోగ విరమణ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని వీకేబీ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం ఘన వీడ్కోలు, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై వెంకటరమణను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, పోలీసు శాఖలో వెంకటరమణ ఎన్నో సంవత్సరాల పాటు అంకితభావం, నిజాయితీ, క్రమశిక్షణతో సేవలందించి […]

నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు

జగిత్యాల/ధనాధన్ న్యూస్, జూన్ 28: ఐదేళ్లలోపు చిన్నారులను పోలియో రహిత భారత నిర్మాణంలో భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని మోతేమాలవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ, దేశం నుంచి పోలియో […]

“గో టు విలేజ్ – మాదిగ పల్లెలకు తరలండి” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

మల్యాల/ధనాధన్ న్యూస్, జూన్ 27: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు చేపట్టిన 40 రోజుల కార్యాచరణలో భాగమైన “గో టు విలేజ్ – మాదిగ పల్లెలకు తరలండి” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెస్పీ-ఎంఆర్పీఎస్ జగిత్యాల జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్ మాదిగ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నాయకులు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా మల్యాల మండల నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షుడు దుమాల గంగారాం మాదిగ మాట్లాడుతూ, ఎస్సీల […]

జిల్లా కలెక్టరేట్‌కు ఆర్టీఐ నోటీసులు

బుగ్గారం,జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 24:జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌కు తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ నుంచి నాలుగు ఆర్టీఐ కేసులకు సంబంధించి నోటీసులు జారీ అయినట్లు సీనియర్ ఆర్టీఐ కార్యకర్త, సామాజికవేత్త చుక్క గంగారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు.ఈ నెల 24వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావాలని జిల్లా కలెక్టరేట్ అధికారులను నోటీసుల్లో ఆదేశించినట్లు చెప్పారు. అయితే, ఈ నోటీసులను జిల్లా […]

పిచ్చికుక్క దాడిలో గాయపడిన వారిని పరామర్శించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 20: సారంగాపూర్ మండలం పోతారం గ్రామంలో శుక్రవారం రాత్రి పిచ్చికుక్క దాడిలో గాయపడిన బాధితులను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శనివారం పరామర్శించారు. పిచ్చికుక్క దాడిలో మహిళలు సహా 11 మందికి పైగా గాయపడగా, వారు జగిత్యాల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఆస్పత్రికి వెళ్లిన ఎమ్మెల్యే బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాయపడిన […]

విద్యను వ్యాపారంగా మారుస్తున్న శ్రీ చైతన్య పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

కరీంనగర్/ధనాధన్ న్యూస్,జూన్ 18: కరీంనగర్ నగరంలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలల యజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల పేరుతో పుస్తకాలు అమ్ముతూ విద్యను వ్యాపారంగా మారుస్తున్నారని శ్రీ చైతన్య పాఠశాలలో విజ్ఞాన కేంద్రాలుగా కాకుండా వ్యాపార కేంద్రాలుగా మారాయని శ్రీ చైతన్య పాఠశాలలు నిబంధనలు పాటించకపోతే ఆ పాఠశాలలపై ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భౌతిక దాడులు చేస్తామని ఒక్క రూపాయి ఎక్కువ ఫీజులు వసూలు చేసిన ఊరుకునేది లేదని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్ హెచ్చరించారు. గురువారం  […]