శ్రీ మడలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

జగిత్యాల/ధనాధన్ న్యూస్, జూన్ 17: జగిత్యాల మండలం వెల్దుర్తి గ్రామంలో నిర్వహించిన శ్రీ మడలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. ఎం. సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు.

అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, సదాశివరావు, ప్రకాష్, మాజీ ఎంపీటీసీ శంకర్, లక్ష్మీరాజు, వెంకటి, శ్రీనివాస్, గంగాధర్‌తో పాటు రజక సంఘం సోదరులు, సోదరీమణులు మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Leave a comment