- బీఆర్ఎస్ నాయకుడు మంతెన చిరంజీవి

కాటారం,జులై 2 (ధనాధన్ న్యూస్): భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంపై ప్రజలకు పూర్తి అవగాహన అవసరమని బీఆర్ఎస్ మండల నాయకుడు, ఇబ్రహీంపల్లి మొదటి వార్డు సభ్యుడు మంతెన చిరంజీవి అన్నారు.
కాటారం మండలంలోని ఇబ్రహీంపల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన ఇంటింటి అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని, ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఓటరు తమ పేర్లు, వ్యక్తిగత వివరాలను ఓటరు జాబితాలో సరిచూసుకుని, అవసరమైన పత్రాలను సంబంధిత అధికారులకు సమర్పించాలని సూచించారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొన్న ఆయన, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చీర్ల తిరుపతి రెడ్డి, గ్రామ యువజన అధ్యక్షుడు బొడ్డు లక్ష్మణ్, చీర్ల ప్రతాప్ రెడ్డి, మంతెన శ్రీనివాస్, కటుకు శ్రీనివాస్, ఏనుగు మల్లేష్, ఆత్కూరి రమేష్, తాళ్లపెల్లి బాపులు తదితరులు పాల్గొన్నారు.
