వర్షాలకు కూలిన ఇంటిని పరిశీలించిన మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి

జగిత్యాల/ధనాధన్ న్యూస్: సారంగపూర్ మండలంలోని పెంబట్ల, కోనపూర్ గ్రామాల్లో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇదే సమయంలో పెంబట్ల గ్రామానికి చెందిన పాస్తం స్వప్న, ఆమె సోదరులు పరమేష్, దుర్గేష్ నివాస గృహం భారీ వర్షాల కారణంగా పూర్తిగా కూలిపోయింది.ఈ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కూలిన ఇంటిని పరిశీలించిన అనంతరం మండల తహసీల్దార్ (ఎంఆర్ఓ), […]
పీఏసీఎస్‌లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

జయశంకర్ భూపాలపల్లి,జులై 2 (ధనాధన్ న్యూస్): కాటారం మండలంలోని గారేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్)ను జిల్లా కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు అందేలా జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఫెర్టిలైజర్ యాప్ ద్వారా జరుగుతున్న యూరియా విక్రయాల ప్రక్రియను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. ఈ-పోస్ యంత్రాల ద్వారా జారీ చేస్తున్న బిల్లులు, రైతుల బుకింగ్ వివరాలు, స్టాక్ రిజిస్టర్లు, ఎరువుల నిల్వల […]
తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత..

హైదరాబాద్, జులై 2 (ధనాధన్ న్యూస్): రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ వాగ్వాదం బుధవారం ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఇరు పార్టీల నేతలు పరస్పరం సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో గన్‌పార్క్ కేంద్రంగా రాజకీయ వేడి నెలకొంది.కాంగ్రెస్ తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో పాటు మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ గన్‌పార్క్‌కు చేరుకుని చర్చకు సిద్ధమయ్యారు. […]
ఎస్ఐఆర్‌పై ప్రజలకు అవగాహన అవసరం

కాటారం,జులై 2 (ధనాధన్ న్యూస్): భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంపై ప్రజలకు పూర్తి అవగాహన అవసరమని బీఆర్ఎస్ మండల నాయకుడు, ఇబ్రహీంపల్లి మొదటి వార్డు సభ్యుడు మంతెన చిరంజీవి అన్నారు.కాటారం మండలంలోని ఇబ్రహీంపల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన ఇంటింటి అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని, ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఓటరు తమ పేర్లు, వ్యక్తిగత వివరాలను ఓటరు జాబితాలో […]
కల్యాణలక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ఎక్కడ?

కమలాపూర్,జూన్ 30(ధనాధన్ న్యూస్): హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలో నిర్వహించిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణలో పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించిన కల్యాణలక్ష్మి, గర్భిణీల సంక్షేమం కోసం కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, రైతులకు రైతుబంధు వంటి పథకాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం […]
తెలంగాణ భూములను దోచుకునే కుట్ర జరుగుతోంది: కల్వకుంట్ల కవిత

హైదరాబాద్/ధనాధన్ న్యూస్,జూన్ 06: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్రంలో భారీ స్థాయిలో భూదందాలు జరుగుతున్నాయని ఆరోపించారు. శనివారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయల విలువైన భూములను బడాబాబులకు అప్పగించే కుట్ర చేస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు భూదందాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, ఇందుకు సంబంధించిన ఆధారాలను దశలవారీగా ప్రజల ముందుకు తీసుకువస్తానని తెలిపారు. తెలంగాణ భూములు, […]
జమ్మికుంటలో ఘనంగా హరీష్ రావు జన్మదిన వేడుకలు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్,జూన్ 3: తెలంగాణ ఉద్యమ యోధుడు, రైతు బాంధవుడు, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో టి హెచ్ ఆర్ టీం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సమీపంలోని శివాలయం (బొమ్మల గుడి)లో అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. టి హెచ్ ఆర్ టీం రాష్ట్ర కమిటీ మరియు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు హరీష్ వర్మ అప్పని […]
కరీంనగర్ బంద్‌పై కాంగ్రెస్ ఫైర్.. బీజేపీ-బీఆర్ఎస్‌పై వొడితల ప్రణవ్ తీవ్ర విమర్శలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్,మే 9:బీజేపీ,బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలకు పాల్పడుతున్నాయని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఆరోపించారు. శనివారం హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.కరీంనగర్ బంద్‌కు బీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడం వెనుక ఉద్దేశ్యం ఏమిటో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికా లేక రాజకీయ బలప్రదర్శనకా ఈ బంద్ నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు బయటకు పరస్పరం […]
కరీంనగర్‌లో శాంతిభద్రతలపై డీజీపీకి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

కరీంనగర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్‌లో రోజురోజుకీ దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, కల్వకుంట్ల సంజయ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్‌తో పాటు ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, దాసోజు శ్రవణ్ కలిసి కలసి వినతిపత్రం సమర్పించారు.ఇటీవల కరీంనగర్ నగరంలో వరుసగా జరుగుతున్న జ్యూవెలరీ షాపుల దొంగతనాలు, ప్రజలపై దాడులు, […]
బత్తుల లక్ష్మీనారాయణను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు బత్తుల లక్ష్మీనారాయణ పక్షవాతం బారిన పడిన విషయం తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ స్పందించారు. ప్రస్తుతం హనుమకొండలోని అజరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మీనారాయణను ఆయన సందర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడిన సతీష్ కుమార్, ఆయనకు అత్యుత్తమ వైద్యం అందించాలని సూచించారు. త్వరగా కోలుకుంటారని నమ్మకం వ్యక్తం చేస్తూ, ఎలాంటి ఆందోళన […]
