- రైతులకు ఎరువుల పంపిణీపై సమీక్ష

జయశంకర్ భూపాలపల్లి,జులై 2 (ధనాధన్ న్యూస్): కాటారం మండలంలోని గారేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్)ను జిల్లా కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు అందేలా జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఫెర్టిలైజర్ యాప్ ద్వారా జరుగుతున్న యూరియా విక్రయాల ప్రక్రియను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు.
ఈ-పోస్ యంత్రాల ద్వారా జారీ చేస్తున్న బిల్లులు, రైతుల బుకింగ్ వివరాలు, స్టాక్ రిజిస్టర్లు, ఎరువుల నిల్వల ప్రదర్శన బోర్డులను తనిఖీ చేశారు.రైతులు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఎరువుల పంపిణీ వేగంగా, సజావుగా జరుగుతుండటంపై జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ పనితీరు, ఎరువుల పంపిణీ విధానంపై రైతులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఏసీఎల్బీ అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, కాటారం ఆర్డీఓ, తహసీల్దార్ నాగరాజు, మండల వ్యవసాయ అధికారి పూర్ణిమ, వ్యవసాయ విస్తరణ అధికారులు రాజన్న, గారేపల్లి పీఏసీఎస్ సిబ్బంది, కాటారం మండలానికి చెందిన పలువురు రైతులు పాల్గొన్నారు.
