జమ్మికుంట, జూలై 26 (ధనాధన్ న్యూస్):
జమ్మికుంట పట్టణంలో ఆర్యవైశ్య అవొపా జమ్మికుంట శాఖ ఆధ్వర్యంలో ఆదివారం “అవొపా మెరిట్ అవార్డ్స్–2026” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘ పెద్దలు, సభ్యులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీతో పాటు వివిధ పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి అత్యధిక మార్కులు సాధించిన ఆర్యవైశ్య విద్యార్థులను అవొపా సంఘం మెమెంటోలు, ప్రశంసా పత్రాలతో ఘనంగా సత్కరించింది. సంఘ నాయకులు, అతిథులు వేదికపై విద్యార్థులకు అవార్డులు అందజేసి అభినందనలు తెలిపారు.


ఈ సందర్భంగా అవొపా నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడమే ఈ మెరిట్ అవార్డుల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రతి ఏడాది ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యార్థులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు.అవొపా జమ్మికుంట అధ్యక్షుడు అకినపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అవొపా అధ్యక్షుడు మల్లిపెద్ది శంకర్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కొమురవెల్లి వెంకటేశం, రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరబోయిన రమేష్, సామా నారాయణ, పి.వి. రామకృష్ణ, జిల్లా బాధ్యులు ఐత సుధాకర్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు లెంకళ్లపల్లి శరత్ కుమార్, అవొపా ప్రధాన కార్యదర్శి నగేష్, మంచాల రాంబాబు, జోన్ ట్రెజరర్ బచ్చు రమేష్, సంఘ సభ్యులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply