జమ్మికుంట, ఆగస్టు 1(ధనాధన్ న్యూస్): కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల అగ్రికల్చర్ ప్రైవేట్ ఎంప్లాయిస్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని శనివారం జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.యూనియన్ అధ్యక్షుడిగా అంబాల రజనీకాంత్ వరుసగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేసిన సభ్యులు మరోసారి ఏకగ్రీవంగా బాధ్యతలు అప్పగించారు.నూతన కమిటీలో ఉపాధ్యక్షుడిగా దొడ్డి రాజు, కోశాధికారిగా రాజేష్, ప్రచార కార్యదర్శిగా నన్నబోయిన రాజును ఎన్నుకున్నారు. యూనియన్ బలోపేతం కోసం కమిటీ సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు అంబాల రజనీకాంత్ మాట్లాడుతూ, అగ్రికల్చర్ ప్రైవేట్ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు, సంక్షేమ పథకాల అమలుకు యూనియన్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. సభ్యులంతా ఐక్యంగా పనిచేస్తూ యూనియన్‌ను మరింత బలోపేతం చేస్తామని అన్నారు.నూతన కార్యవర్గానికి యూనియన్ సభ్యులు అభినందనలు తెలియజేస్తూ, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. సమావేశంలో సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply