
నడికూడ, ధనాధన్ న్యూస్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు నడికూడ మండలంలోని అన్ని గ్రామాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. సద్దుల బతుకమ్మ వేడుకలను ఆయా గ్రామాల సర్పంచులు, గ్రామ పాలకవర్గ సభ్యులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని, రంగురంగుల పుష్పాలతో అందంగా అలంకరించిన బతుకమ్మలతో ఆటపాటలు ఆడుతూ సందడి చేశారు. బతుకమ్మ పాటలతో పల్లె వాతావరణం మారుమోగగా, పూల సోయగాలతో గ్రామాల్లో పండుగ శోభ సంతరించుకుంది. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా వేడుకలను జరుపుకున్నారు.బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలవడంతో పాటు మహిళల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుందని గ్రామాల ప్రజలు పేర్కొన్నారు. నడికూడ మండలంలోని అన్ని గ్రామాల్లో బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి.
