పట్టభద్రుల ఇంటింటికి సర్పంచ్ రేణుక

నడికూడ ధనాధన్ న్యూస్: వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఆన్లైన్ ఓటు ఎన్రోల్మెంట్ ప్రక్రియలో భాగంగా టీపీసీసీ డీసీసీ,పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు నడికూడ మండలం చర్లపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ బండి రేణుక శంకర్ ప్రచారం నిర్వహించడం అలాగే 9,10,11,12 వార్డుల పట్టభద్రుల ఇంటింటికి వెళ్లి పట్టభధ్రులను ఓటు నమోదు చేసుకోవాలని అవగాహన కల్పించామని ఓటు చాలా విలువైనది ఓటు వజ్రాయుధమని ఓటు నమోదు చేసుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలని పట్టబద్ధులకు […]
చర్లపల్లి పాఠశాలలో హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డుల పంపిణీ

నడికూడ, ధనాధన్ న్యూస్: హన్మకొండ జిల్లా నడికూడ మండలం చర్లపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ అధ్యక్షతన తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు.ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ ముఖ్యమైన రెండు ప్రధాన అంశాలను తల్లిదండ్రులకు,విద్యార్థులకు వివరిస్తూ,హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్కేవలం మార్కులు లేదా గ్రేడ్లకే పరిమితం కాకుండా,విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిని అంచనా వేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సమగ్ర ప్రగతి పత్రం’ (హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్) యొక్క ప్రాముఖ్యత అని విద్యార్థుల విద్యా విషయక ప్రగతితో పాటు వారి ప్రవర్తన, […]
‘నడికూడ’ ప్రజావాణిలో ఒకటే వినతి పత్రం

నడికూడ, ధనాధన్ న్యూస్ : నడికూడ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ఎంపీఓ మార్గవి రెడ్డి,తహసిల్దార్ రాణి ఆధ్వర్యంలో జరగగా మొత్తం అధికారులు 15 మంది కాగా హాజరైన అధికారులు 12 మంది, గైర్హాజరు అధికారులు ముగ్గురు అని ఒక వినతి పత్రం వచ్చిందని అది కూడా రెవెన్యూ శాఖ నుండి సర్టిఫికెట్ దృవీకరించి తొందరగా ఇవ్వాలని కోరుతున్నట్లు ప్రజావాణిలో అందజేసిన ఒక్క వినతి పత్రం అని ఉదయం పది గంటల […]
కంఠాత్మకూర్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం

నడికూడ, ధనాధన్ న్యూస్: నడికూడ మండల పరిధిలోని కంఠాత్మకూర్ గ్రామంలో పట్టభద్రుల ఓటర్ నమోదు క్యాంపు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అర్హులైన పట్టభద్రుల నుండి క్లస్టర్ ఇంచార్జీ గుడికందుల శివ ఆధ్వర్యంలో ఓటరు నమోదు కొరకై దరఖాస్తులు స్వీకరించి ఓటు నమోదు చేశారు.ఈ సందర్భంగా క్లస్టర్ ఇంచార్జీ గుడికందుల శివ మాట్లాడుతూ గ్రామంలో నవంబర్ 2023 లోపు డిగ్రీ లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జి […]
సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను కొనసాగిద్దాం

హనుమకొండ,ధనాధన్ న్యూస్: భారత లోహపు మనిషి,దేశ ప్రథమ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ జిల్లా నడికూడ మండలం చర్లపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో “జాతీయ ఐక్యత దినోత్సవం” ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.ముందుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశాన్ని ఏకం చేయడంలో పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయమని,విద్యార్థులు ఆయన జీవితాన్ని ఆదర్శంగా […]
బిఆర్ఎస్ కు సర్పంచ్ రేణుక షాక్

హనుమకొండ, ధనాధన్ న్యూస్: పరకాల నియోజకవర్గం నడికూడ మండలం చర్లపల్లి గ్రామ సర్పంచ్ బండి రేణుక శంకర్ బీఆర్ఎస్ పార్టీని వీడి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.ఈ సందర్భంగా పలువురికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు.కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ పాలన,అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ,ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామాభివృద్ధి కోసం సమన్వయంతో […]
అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి

నడికూడ, ధనాధన్ న్యూస్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అర్హులైన పట్టభద్రులు ఓటర్ గా నమోదు చేసుకోవాలని నడికూడ మండల తహసీల్దార్ రాణి సూచించారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమని పేర్కొన్నారు.అర్హత ఉన్నప్పటికీ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోకపోతే భవిష్యత్తులో ఓటు వేసే అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి ఉంటుందని అందువల్ల అర్హులైన పట్టభద్రులు అవసరమైన ధ్రువపత్రాలతో సంబంధిత హెల్ప్ డెస్క్లను సంప్రదించి,ఓటరు నమోదును పూర్తి చేసుకోవాలని […]
నడికూడ మండలంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

నడికూడ, ధనాధన్ న్యూస్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు నడికూడ మండలంలోని అన్ని గ్రామాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. సద్దుల బతుకమ్మ వేడుకలను ఆయా గ్రామాల సర్పంచులు, గ్రామ పాలకవర్గ సభ్యులు ప్రారంభించారు.ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని, రంగురంగుల పుష్పాలతో అందంగా అలంకరించిన బతుకమ్మలతో ఆటపాటలు ఆడుతూ సందడి చేశారు. బతుకమ్మ పాటలతో పల్లె వాతావరణం మారుమోగగా, పూల సోయగాలతో గ్రామాల్లో పండుగ శోభ సంతరించుకుంది. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో […]
నడికూడ యువత గొంతుగా పని చేస్తా

నడికూడ,ధనాధన్ న్యూస్ : నాపై నమ్మకం,విశ్వాసం ఉంచి నడికుడ మండల బీజేవైఎం అధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పగడాల కాళీ ప్రసాద్,రావు పద్మ, హనుమకొండ జిల్లా బీజేవైఎం అధ్యక్షులు,నా ఆత్మీయ మిత్రుడు పున్నం వేణు, హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు కోలాను సంతోష్ రెడ్డి,నడికూడ మండల బీజేపీ అధ్యక్షులు ఎరుకల దివాకర్ లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు,భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు,ఆశయాలు, దేశభక్తి స్ఫూర్తితో యువతను ఏకం చేస్తూ,కార్యకర్తలతో కలిసి పార్టీ బలోపేతానికి కృషి […]
ఘనంగా బతుకమ్మ వేడుకలు

హనుమకొండ,ధనాధన్ న్యూస్ : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.ఈ సందర్భంగా గ్రామాలలోని మహిళలు,ఆడపడుచులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు,ఆటపాటలతో పండుగ సంబరాలను అంగరంగ వైభవంగా నానే బియ్యం బతుకమ్మను జరుపుకున్నారు. పూల పండుగ బతుకమ్మ మహిళల ఆత్మీయత, ఐక్యతకు తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుందని,బతుకమ్మ ఆట,పాటలతో గ్రామాల్లో సందడి నెలకొంది.
