హనుమకొండ,ధనాధన్ న్యూస్: భారత లోహపు మనిషి,దేశ ప్రథమ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ జిల్లా నడికూడ మండలం చర్లపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో “జాతీయ ఐక్యత దినోత్సవం” ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.ముందుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశాన్ని ఏకం చేయడంలో పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయమని,విద్యార్థులు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. దేశ ఐక్యత,సమగ్రతలను కాపాడటంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని పేర్కొన్నారు. అనంతరం గ్రామస్తులలో ఐక్యత భావాన్ని పెంపొందించేలా విద్యార్థులు,ఉపాధ్యాయులు కలిసి గ్రామంలో ఉత్సాహంగా ఐక్యత దినోత్సవ ర్యాలీ నిర్వహించారు.దేశభక్తి నినాదాలతో గ్రామం మార్మోగింది. ర్యాలీ అనంతరం పాఠశాల ప్రాంగణంలో దేశ ఐక్యతను కాపాడుతామని అందరిచేతా జాతీయ ఐక్యత దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లకావత్ దేవా కంచ రాజ్ కుమార్ పుల్లూరి రామకృష్ణ ప్రీ ప్రైమరీ టీచర్ బండి శ్వేత విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply