నడికూడ, ధనాధన్ న్యూస్:  హన్మకొండ జిల్లా నడికూడ మండలం చర్లపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ అధ్యక్షతన తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు.ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ ముఖ్యమైన రెండు ప్రధాన అంశాలను తల్లిదండ్రులకు,విద్యార్థులకు వివరిస్తూ,హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్
కేవలం మార్కులు లేదా గ్రేడ్లకే పరిమితం కాకుండా,విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిని అంచనా వేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సమగ్ర ప్రగతి పత్రం’ (హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్) యొక్క ప్రాముఖ్యత అని విద్యార్థుల విద్యా విషయక ప్రగతితో పాటు వారి ప్రవర్తన, సృజనాత్మకత, క్రీడలు,నైతిక విలువలు,సామాజిక నైపుణ్యాలను స్పష్టంగా అంచనా వేయవచ్చని పాఠశాలలో విద్యార్థుల క్రమం తప్పని హాజరును ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహిస్తున్న “హాజరు మాసోత్సవం” గురించి వివరిస్తూ  “ప్రతి రోజు బడికి వెళ్దాం – ప్రగతి బాటలో నడుద్దాం” అనే నినాదంతో విద్యార్థులు, తల్లిదండ్రులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

నూటికి నూరు శాతం హాజరు నమోదయ్యేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.ఈ సమావేశంలో పాఠశాల ఉపాధ్యాయులు లకావత్ దేవా,కంచరాజు కుమార్,పుల్లూరి రామకృష్ణ,ఫ్రీ ప్రైమరీ టీచర్ బండి శ్వేత, అంగన్వాడీ టీచర్స్ భీముడి లక్ష్మీ,నందిపాటి సంధ్య,అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కందికట్ల రమ కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు.

Leave a Reply