- సుదర్శన్ కంపెనీ ఏఎస్ఎం కిషోర్ రెడ్డి

పరకాల, నవంబర్ 6: పరకాల మండలం వెల్లంపల్లి గ్రామంలో రైతు బొద్ది రెడ్డి రాజేందర్ రెడ్డి సాగు చేస్తున్న 2 ఎకరాల మిర్చి పంటలో సుదర్శన్ కంపెనీకి చెందిన స్పెక్ట్రా మందు పనితీరును పరిశీలించారు. పది రోజుల క్రితం పిచికారీ చేసిన స్పెక్ట్రా మందు పచ్చదోమ, తెల్లదోమ, ముడత, నల్లి, సన్నపురుగు నివారణలో మంచి ఫలితాలు ఇచ్చిందని రైతు తెలిపారు. ఈ సందర్భంగా కంపెనీ ఏఎస్ఎం కిషోర్ రెడ్డి, డీజీఈ కన్నం రాజు ఆధ్వర్యంలో మిర్చి తోటలో ఫీల్డ్ డెమో నిర్వహించారు. రైతు రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ స్పెక్ట్రా మందు పంటలో మంచి ప్రభావం చూపిందని, మిర్చి సాగు చేస్తున్న రైతులు ఈ మందును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుపతిరెడ్డి, మల్లారెడ్డి, రాజేందర్ సుమారు 30 మంది రైతులు పాల్గొని మందు పనితీరును పరిశీలించారు.
