దుద్దెనపల్లి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు

By dhanadhannews.com

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో శనివారం రోజున ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు,విద్యార్థులు బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు,విద్యార్థులు తెలంగాణ సాంప్రదాయకంగా చీరలు కట్టి, నెత్తిన బోనం ఎత్తి, శివసత్తులు,పోతరాజు వేషం కట్టి విద్యార్థులు ఆటపాటలతో అలరిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బోనాల పండుగను అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో, బోనం వండి,గ్రామ దేవతలను స్మరిస్తూ ప్రసాదం సమర్పించారు.ప్రైమరీ స్కూల్ హెచ్ఎం విజయ్ మాట్లాడుతూ ఉపాధ్యాయులతో మరియు పిల్లలతో కలిసి బోనాల పండుగను జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ విధంగా వేడుకలు జరుపుకోవడం ద్వారా పిల్లలకు మరియు ఉపాధ్యాయులకు మానసికంగా ఉల్లాసంగా ఉంటుందని ఇలాంటి కార్యక్రమం జరుపుకోవడం వలన తెలంగాణ సంప్రదాయాలు పద్ధతు లపై పిల్లలకు అవగాహన వస్తుందని, ఈ కార్యక్రమం ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మమత, సుధాకర్, అంగన్వాడి టీచర్ నిర్మల,శ్రావణి, శ్రీలత, తిరుపతి రెడ్డి, శ్రీనివాస్, అజయ్, భాగ్యలక్ష్మి, శోభ, జయ సుధా, తదితరులు పాల్గొన్నారు