కేంద్రీయ విద్యాలయంపై రాజకీయాలు మానుకోవాలి: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 17: జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. ఎం. సంజయ్ కుమార్ మాట్లాడారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుపై ఎంపీ ధర్మపురి అరవింద్ అనుచరులు చేస్తున్న వ్యాఖ్యలకు స్పందిస్తూ, కేంద్రీయ విద్యాలయానికి అవసరమైన 5 ఎకరాల స్థల కేటాయింపు ప్రక్రియ పూర్తయిందని తెలిపారు.జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో భూమి సర్వే నిర్వహించి, సంబంధిత పత్రాలను సుమారు పది రోజుల క్రితమే కేంద్రీయ విద్యాలయ సంఘటన్ డిప్యూటీ కమిషనర్‌కు […]
ఎమ్మెల్యే ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు:డాక్టర్ భోగ శ్రావణి

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 17: జగిత్యాల అభివృద్ధిపై ఎమ్మెల్యే ప్రజలకు సమాధానం చెప్పాలని, కేంద్ర విద్యాలయానికి స్థలం కేటాయింపును అడ్డుకుంటున్నది ఎవరో స్పష్టం చేయాలని బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ భోగ శ్రావణి డిమాండ్ చేశారు. జగిత్యాలలోని కమల నిలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.అధికారిక కార్యక్రమాల్లో ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు కనీస మర్యాదలు కూడా పాటించడం లేదని ఆమె విమర్శించారు. సభా మర్యాదల గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్యేకు ఉందా అని ప్రశ్నించారు. కార్యక్రమాల్లో […]
మాల సంక్షేమ సంఘం సర్వాయిపేట గ్రామ పంచాయతీ అధ్యక్షుడిగా దొంత హరీష్ ఏకగ్రీవ ఎన్నిక

సైదాపూర్/ధనాధన్ న్యూస్,జూన్ 14: సైదాపూర్ మండలంలోని సర్వాయిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వాయిపేట, శివరాంపల్లి జంట గ్రామాల మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా దొంత హరీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘ సభ్యులు, పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.సంఘ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని, మాల సంఘం సంక్షేమం, ఐక్యత, పురోగతి కోసం నిరంతరం పనిచేస్తానని హరీష్ పేర్కొన్నారు. సంఘ సభ్యులందరి సహకారంతో గ్రామాల్లో సామాజిక, […]
డా.బి.ఆర్.అంబేద్కర్ గొప్పతనాన్ని ప్రతి పౌరుడు తెలుసుకోవాలి

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 14:జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, డిక్కీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహించే అంబేద్కర్ స్మరణ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి, మెట్రో ఉదయం జిల్లా స్టాఫ్ రిపోర్టర్, సీఎంపీ న్యూస్ ఛానల్ అధినేత మల్యాల సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. […]
ఆకునూరు పాఠశాలలో స్వచ్ఛ పాఠశాల – స్వచ్ఛ భారత్ కార్యక్రమం

సైదాపూర్/ధనాధన్ న్యూస్,జూన్ 13: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా సైదాపూర్ మండలంలోని ఆకునూరు ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం “స్వచ్ఛ పాఠశాల – స్వచ్ఛ భారత్” కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా హుస్నాబాద్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ గుర్రాల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పాఠశాల ఆవరణ, తరగతి గదులు, డ్రైనేజీలను శుభ్రపరిచి, చెత్తాచెదారం, కలుపు మొక్కలను తొలగించినట్లు పేర్కొన్నారు. […]
గండి రంజిత్ కుమార్ గౌడ్‌కు తెలంగాణ స్ఫూర్తి నంది పురస్కారం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్ జూన్ 13: ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ మీడియా రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు గండి రంజిత్ కుమార్ గౌడ్‌కు ప్రతిష్టాత్మక తెలంగాణ స్ఫూర్తి నంది పురస్కారం లభించింది.జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ తెలుగు వెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో వరంగల్‌లోని టీఎన్‌జీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు.దాదాపు […]
జగిత్యాల జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు ఐఎంఏ ముందడుగు

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 13: మాదకద్రవ్యాల వ్యసన నిర్మూలనకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించనున్న “యాంటీ డ్రగ్ 3కే రన్” కార్యక్రమ కరపత్రాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్ శనివారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, యువతను లక్ష్యంగా చేసుకుని విస్తరిస్తున్న మాదకద్రవ్యాల వ్యసనం దేశ భవిష్యత్తుకు తీవ్రమైన ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ దుర్వినియోగంపై ప్రజల్లో, ముఖ్యంగా […]
బుగ్గారం పోలీస్ స్టేషన్‌లో సీసీటీవీ ఫుటేజీలు మాయం

బుగ్గారం/ధనాధన్ న్యూస్,జూన్ 13: జగిత్యాల జిల్లా బుగ్గారం పోలీస్ స్టేషన్‌లో సీసీటీవీ ఫుటేజీలు అదృశ్యమైన ఘటనపై కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సీనియర్ జర్నలిస్టు చుక్క గంగారెడ్డి శనివారం బుగ్గారం ఎస్సై జి. సతీష్‌కు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 2022 మే 1న బుగ్గారం పోలీస్ స్టేషన్ ఎదుట తనపై హత్యాయత్నం దాడి జరిగిందని తెలిపారు. ఆ ఘటనకు సంబంధించి అప్పటి ఎస్సై గుడికందుల సందీప్ కేసు నమోదు చేశారని […]
కనగర్తి ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా “మన బడి – మన బాధ్యత” కార్యక్రమం

ఇల్లందకుంట/ధనాధన్ న్యూస్,జూన్ 13: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న “మన బడి – మన బాధ్యత” కార్యక్రమంలో భాగంగా ఇల్లందకుంట మండలంలోని కనగర్తి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో శనివారం ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు.బీజేపీ సీనియర్ నాయకుడు మట్ట పవన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల […]
మోడీ స్వచ్ఛత పిలుపుతో కదిలిన బీజేపీ శ్రేణులు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్,జూన్ 13:ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో (గర్ల్స్ హైస్కూల్) శనివారం బీజేపీ నాయకులు ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. “స్వచ్ఛ పాఠశాల – స్వచ్ఛ భారతం” అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు స్వయంగా శ్రమదానం చేసి పాఠశాల పరిసరాలను శుభ్రపరిచారు.ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో పేరుకుపోయిన చెత్తను తొలగించడంతో పాటు మొక్కల చుట్టూ పెరిగిన […]
