

సైదాపూర్/ధనాధన్ న్యూస్,జూన్ 13: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా సైదాపూర్ మండలంలోని ఆకునూరు ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం “స్వచ్ఛ పాఠశాల – స్వచ్ఛ భారత్” కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా హుస్నాబాద్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ గుర్రాల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పాఠశాల ఆవరణ, తరగతి గదులు, డ్రైనేజీలను శుభ్రపరిచి, చెత్తాచెదారం, కలుపు మొక్కలను తొలగించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు పరిశుభ్రమైన వాతావరణంలో విద్యాభ్యాసం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆకునూరు గ్రామ సర్పంచ్ గుర్రాల స్వతంత్ర, మాజీ ఎంపీటీసీ సభ్యుడు భాషవేణి సంపత్, బూత్ అధ్యక్షుడు గుర్రాల లక్ష్మణ్ రెడ్డి, బీజేపీ నాయకులు కొల్ల రంజిత్, బొజ్జ కుమార్, భాషవేణి రాకేష్, గౌరవేణి జైపాల్ తదితరులు పాల్గొన్నారు.