జమ్మికుంటలో ఎరుకల జాతి ఆత్మగౌరవ పోరాట జెండా ఆవిష్కరణ

By dhanadhannews.com

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణ పరిధి 16వ వార్డులోని ఎస్టీ కాలనీలో ఆదివారం ఎరుకల కులస్తుల సమక్షంలో ఎరుకల జాతి ప్రజల ఆత్మగౌరవ పోరాట జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా తిరుపతి శ్రీనివాస్ మాట్లాడుతూ,
1952 ఆగస్టు 31న క్రిమినల్ ట్రైబ్స్ (CT Act) రద్దు చేయబడిన దినాన్ని పురస్కరించుకొని ఈ జెండా ఆవిష్కరణ చేపట్టినట్లు తెలిపారు. బ్రిటిష్ పాలకులు ఎరుకల తెగల అడవి సంపదను దోచుకోవడానికి కుట్రలు పన్ని, వారి ప్రతిఘటనను అణచివేయడానికి ఈ చట్టాన్ని అమలు చేశారని అన్నారు. దాంతో ఎరుకల జాతిని సమాజంలో భయంకరమైన తెగగా ముద్రవేసి, అనేక అవమానాలకు గురిచేశారని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ ఎరుకల జాతి ఆత్మగౌరవ పోరాటం ఎప్పటికీ కొనసాగుతుందన్నారు.

కార్యక్రమంలో కుల పెద్దలు తిరుపతి సమ్మయ్య, రేవేల్లి బుచ్చయ్య, తిరుపతి రాజమౌళి, రేవేల్లి రాజయ్య, కేంసారపు తిరుపతి, కేతిరి సంజీవ్ కుమార్, లోకిని రాజయ్య, రేవేల్లి శ్రీనివాస్, లోకిని చిన్న రాజయ్య, శంకర్, రవి, వెంకటేష్, పల్లకొండ రాజ్ కుమార్, తిరుపతి ఎల్ల స్వామి, కుర్ర రాజు తదితరులు పాల్గొన్నారు.

అలాగే సంఘం ప్రతినిధులలో యూత్ అధ్యక్షుడు లోకిని రాజేష్, ఉపాధ్యక్షుడు రేవేల్లి మహేష్, కోశాధికారి రేవేల్లి సతీష్, సంయుక్త కార్యదర్శి ఉండాది అనిల్, రేవేల్లి అంజి, ప్రచార కార్యదర్శి రేవేల్లి బాలు తదితరులు పాల్గొన్నారు.