శంకరపట్నం, జూలై 8 (ధనాధన్ న్యూస్): ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత  జన్మదిన వేడుకలు, ఎమ్మార్పీఎస్ ఉద్యమ సంస్థ ఆవిర్భావ దినోత్సవాన్ని శంకరపట్నం మండలంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.మండల కేంద్రంలోని కేశవపట్నంలో ఎమ్మార్పీఎస్ మండల శాఖ అధ్యక్షుడు కనుకుంట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో, అంబేద్కర్ నగర్ గ్రామంలో మండల ప్రధాన కార్యదర్శి యామునూరి నాగరాజు ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దళిత హక్కుల సాధన, ఎస్సీ వర్గీకరణ కోసం మూడు దశాబ్దాలకు పైగా మందకృష్ణ మాదిగ నిరంతరం పోరాటం చేస్తున్నారని కొనియాడారు. ఆయన నేతృత్వంలోని ఎమ్మార్పీఎస్ ఉద్యమం సామాజిక న్యాయం సాధనలో కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు దిశగా ముందుకు తీసుకెళ్లడంలో మందకృష్ణ మాదిగ పోరాటం కీలకమైందని అభిప్రాయపడ్డారు.
అనంతరం మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను నిర్వహించి జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్, మిఠాయిల పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ నగర్ సర్పంచ్ పులికోట ప్రేమలత–రమేష్, ఉపసర్పంచ్ శనిగరపు అంజయ్య, మాదిగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సముద్రాల సంపత్, భీమ్ ఆర్మీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ వాసాల శ్రీనివాస్, సంఘం నాయకులు సాయిల్ యాదవ్, మోరె ప్రభాకర్, మెరుగు శ్రీనివాస్, భూమయ్య, లింగస్వామి, బిక్షపతి, సమ్మయ్య, సురేష్, రాజ్‌కుమార్, సంపత్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply