హనుమకొండ, ధనాధన్ న్యూస్: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ‘గురు వందనం’ కార్యక్రమాన్ని హనుమకొండలోని ఏబీవీపీ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రదానం చేశారు.సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర మరపురానిదని, విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందిస్తూ విశేష సేవలు చేస్తున్న ఉపాధ్యాయులను గౌరవించడం అభినందనీయమని తపస్ జిల్లా అధ్యక్షుడు బత్తిని వీరస్వామి, ప్రధాన కార్యదర్శి మూల రామకృష్ణ అన్నారు.కార్యక్రమంలో భాగంగా నడికూడ మండలంలో ఉత్తమ సేవలు అందించిన నిగ్గుల శ్రీదేవి (ఎస్జీటీ, ఎంపీపీఎస్ నార్లాపూర్), కసుబోజుల కవిత (యూపీఎస్ పులిగిల్ల), జ్యోత్స్న (జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నడికూడ), సాంబరాజు (జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కౌకొండ)లకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందజేశారు. తపస్ జిల్లా అధ్యక్షుడు బత్తిని వీరస్వామి, ప్రధాన కార్యదర్శి మూల రామకృష్ణ చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా తపస్ జిల్లా నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖ వికాసానికి, సమాజ శ్రేయస్సుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు. అవార్డులు అందుకున్న శ్రీదేవి, కవిత, జ్యోత్స్న, సాంబరాజులను తపస్ రాష్ట్ర బాధ్యులు సంఘెం శ్రీనివాస్, మాచర్ల భిక్షపతి, మండల విద్యాశాఖ అధికారి కున్సోతు హనుమంతరావు, పిఆర్టియు హనుమకొండ జిల్లా శాఖ అధ్యక్షులు లలిత శ్రీహరి, నడికూడ మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మోడెం రాజేందర్ బాబు, అచ్చ సుదర్శన్‌తో పాటు పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.కార్యక్రమంలో తపస్ జిల్లా ముఖ్య నాయకులు, పలువురు ఉపాధ్యాయులు, విద్యారంగ ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a Reply