- తిండికి లేక రబ్బరు చెప్పులతో తిరిగే నీకు వందల కోట్లు ఎలా వచ్చాయి
- నీ అక్రమ సంపాదన పై చర్చ సిద్ధమా బానిస సుమన్
- బాల్క సుమన్ పై టీపీసీసీ ఎస్సీ సెల్ మాజీ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్ ఫైర్
హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో టీపీసీసీ ఎస్సీ సెల్ మాజీ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్ మాట్లాడుతూ చెన్నూరు లో చెల్లని రూపాయి బానిస సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై పిచ్చి పిచ్చిగా వాగితె తాట తీస్తామని హెచ్చరించారు.ఉస్మానియా యూనివర్శిటీ లో అమాయకపు విద్యార్థులతో చెలగాటమాడి టికెట్ తెచ్చుకొని తిండికి లేక రబ్బరు చెప్పులతో తిరిగే నువ్వు ఇవాళ అడ్డగోలుగా వందల కోట్లు కూడబెట్టుకున్నావు,ఇన్ని వందల కోట్ల ఆస్తులు నీకు ఎలా వచ్చాయని, నీ అక్రమ సంపాదన పై బహిరంగ చర్చకు సిద్ధమా అని దొంత రమేష్ ఛాలెంజ్ చేశారు.బడుగు బలహీన వర్గాల ద్రోహి కెసిఆర్ కి కొమ్ము కాస్తూ నీ చిల్లర మాటలు చేతలు ప్రవర్తన చూసి విసిగిపోయిన చెన్నూరు ప్రజలు నిన్ను తిరస్కరించారు.ఆ విషయం మరిచి పదవి వ్యామోహం తీరక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అవాకులు చెవాకులు పేలితే తెలంగాణ ప్రజానీకం బట్టలూడదీసి కొడతారని తెలిపారు.సుమన్ లాంటి వ్యక్తులు ప్రజాస్వామ్యం లో నాయకులుగా చెలామణి అవ్వడం సిగ్గుచేటని,ప్రతిపక్షంలో ఉన్నపుడు బాధ్యతగా హుందాగా ప్రవర్తించాలి,కాని సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేయడం పద్ధతి కాదు తక్షణమే బేషరతుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలి లేని పక్షంలో బాల్క సుమన్ ఇంటిని ముట్టడించి తెలంగాణ సమాజంలో తిరగకుండా అడ్డుకుంటామని రమేష్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొల్లూరి కిరణ్, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి చందమల్ల బాబు,హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి బిఆర్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు టేకుల శ్రావణ్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దుబాసి బాబు,హుజురాబాద్ మండల కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జ్ మిడిదొడ్డి రాజు,జంగా అనిల్,గడ్డం రాఘవేంద్ర,చల్లూరి విష్ణువర్ధన్,ముక్క రవితేజ,ముక్క రమేష్,అంతడుపుల మనోహర్,తదితరులు పాల్గొన్నారు.
