సర్పంచి కూతురు చేతుల మీదుగా భవనాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం.

By dhanadhannews.com

  • హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్

సైదాపూర్, ధనా ధన్ న్యూస్:

సర్పంచ్ కూతురుతో గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభం.

సైదాపూర్ మండలంలోని ఆరేపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన మంత్రి ఉన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రారంభోత్సవాలు మేమే చేసుకుంటామంటే నడవదు.
హుస్నాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతోటే ముందుకు వెళుతున్న గెలిచిన వెంటనే హుస్నాబాద్ అభివృద్ధికి సహకరించాలని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు ఫోన్ చేశానని అన్నారు.పొన్నం ప్రభాకర్ కు తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఉద్యమించిన చరిత్ర ఉంది గుర్తుంచుకో,
ఎన్నికల వరకే రాజకీయాలు చేస్తా
నీలాగా కాళ్ళు మొక్కించుకునే చరిత్ర నాది కాదు
అహంకారం ఉంటే నీ ఇంట్లో పెట్టుకోవాలంటూ మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు కి సూచనలు చేశారు.
కొత్తకొండ జాతరకు రావాలని పిలిచి శాలువా కప్పి సన్మానం చేశానని,రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగిన వ్యక్తిని అని,హైదరాబాద్ కు ఇన్చార్జి మంత్రి నైనా,ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అయినట్టుగా హుస్నాబాద్ కు నేను బిడ్డనే
వేసవిలో ఎక్కడ త్రాగునీటి సమస్య ఉండొద్దని అధికారులకు సూచించానని,అన్ని గ్రామ పంచాయతీలలో వాటర్ ప్లాంట్ లు పెట్టిస్తా అన్నారు.ఈ కార్యక్రమంలో ఆరేపల్లి గ్రామ సర్పంచ్ ఆవునూరు పాపయ్య, ఉప సర్పంచ్ రాజవ్వ రవి, వార్డ్ మెంబర్స్ యాదగిరి, రమాదేవి,శ్యామల, ఐలయ్య,సమ్మయ్య, స్వరూప,మొండయ్య ,జెడ్పి వైస్ చైర్మన్ గోపాల్ రావు,ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంత సుధాకర్, మాజీ జెడ్పిటిసి గుండారం శ్రీనివాస్, గ్రామపంచాయతీ కార్యదర్శి మంజుల వివిధ గ్రామాల సర్పంచులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు