జమ్మికుంట,ధనా ధన్ న్యూస్:
ముద్ర దినపత్రిక అనాతి కాలంలో ప్రజల అభిమానాన్ని,ఆదరణను చురగోన్నది అని పిఎసిఎస్ చైర్మన్ పొన్నగంటి సంపత్ అన్నారు.
జమ్మికుంట పట్టణంలోని పిఎసిఎస్ చైర్మన్ పొనగంటి సంపత్ ఆధ్వర్యంలో ముద్ర దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పత్రికా యాజమాన్యాన్ని సిబ్బందిని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు నేటి సమాజంలో పత్రికల పాత్ర కీలకమైందని వీటికి స్వేచ్ఛ ముఖ్యమన్నారు పత్రికల్లో పని చేసే జర్నలిస్టులకు పత్రికలకు కూడా స్వేచ్ఛ ఉండాలని తెలిపారు. ఎవరికి భయపడకుండా నిర్భయంగా నిస్సంకోచంగా వార్తలు రాసి నిజా నిజాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం పాత్రికేయులపై ఉందన్నారు . ముద్రా దినపత్రిక పక్షపాత ధోరణి లేకుండా సమన్వయం పాటిస్తూ ప్రజలకు అత్యంత వేగంగా వార్తలు అందించడంలో పతాక శీర్షికన నిలబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఖాన్ శెట్టి మల్లయ్య, కొమురయ్య,ముద్ర దినపత్రిక జమ్మికుంట రిపోర్టర్ నరికే రవీందర్ యాదవ్,నాయకులు,పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు.
