పెరకపల్లి అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన సర్పంచ్ బత్తుల కొమరయ్య.

By dhanadhannews.com

  • పదవి విరమణ చేసిన పెర్కపల్లి పాలకవర్గం.
పెర్కపల్లి పాలకవర్గం.

సైదాపూర్ మండల కేంద్రంలోని పెర్కపల్లె గ్రామంలో పదవి విరమణ సమావేశాన్ని నిర్వహించారు సర్పంచ్ బత్తుల కొమరయ్య మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నన్ను సర్పంచిగా గెలిపించిన ప్రజలకు నేను ఎల్లవేళలా రుణపడి ఉంటానని జంట గ్రామాలు అయిన గొల్లగూడెం పెర్కపల్లి గ్రామాలను అభివృద్ధి దిశగా నడిపించడం కోటి రూపాయలతో వాడ వాడకు సిసి రోడ్డు నిర్మాణం చేయడం డంపింగ్ యార్డ్ స్మశాన వాటిక పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అని ఐదు సంవత్సరాల రాజకీయ పరిపాలనలో సహాయ సహకారాలు తోడుగా ఉండి సహకరించిన పాలకవర్గానికి జంట గ్రామాల ప్రజలకు ఎన్ని జన్మలు ఎత్తిన ప్రజల రుణాన్ని తీర్చుకోలేను అని తెలిపారు జంట గ్రామాల ప్రజలు మాట్లాడుతూ మా జంట గ్రామాలకు ఎంతోమంది సర్పంచులు వచ్చారు వెళ్లారు.ఒక రిటైర్డ్ ఎంఈఓ గా జ్ఞానవంతుడు అయినా సర్పంచ్ బత్తుల కొమరయ్య జంట గ్రామాలకు సర్పంచిగా దొరకడం మా అదృష్టం అని ఎవరు చేయలేని అభివృద్ధి సర్పంచ్ బత్తుల కొమరయ్య చేశారని జంట గ్రామాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తారని జంట గ్రామాల ప్రజలు ఐదు సంవత్సరాల సర్పంచి పదవీకాలం ముగియడంతో గొల్లగూడెం పెరకపల్లె ప్రజలు సర్పంచ్ బత్తుల కొమరయ్య చేసిన సేవలను మరవలేనిదని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బత్తుల కొమరయ్య,ఉప సర్పంచ్ పోతరాజు శ్రీనివాస్ మహేశ్వరి,మొదటి వార్డ్ నెంబర్ బత్తుల లత మోహన్,రెండో వార్డ్ మెంబర్ చల్లూరి రాజయ్య రాజేశ్వరి,మూడో వార్డ్ మెంబర్ ముత్యాల సదయ్య,నాలుగో వార్డ్ నెంబర్ కొరిమి సదయ్య,ఐదవ వార్డ్ మెంబర్ అందే సమ్మక్క కొమరయ్య,ఏడో వార్డు నెంబర్ బోళ్ల విజయ పరమేశ్వర్,ఎనిమిదో వార్డ్ మెంబర్ కానగంటి భవాని తిరుమల్,తొమ్మిదవ వార్డ్ మెంబర్ తిప్పని దివ్య దేవేందర్, పదో వార్డ్ నెంబర్ పోతరాజు కవిత కర్ణాకర్,పంచాయతీ కార్యదర్శి ఎనగందుల యశోద, గ్రామపంచాయతీ సిబ్బంది లక్కరుసు రాజయ్య, మిట్టపల్లి మల్లయ్య,తిప్పారపు అనిల్,గుర్రం కొమరమ్మ,కో ఆప్షన్ సభ్యులు తిప్పని సుభద్ర రమేష్, జంట గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.