
హైదరాబాద్,జూలై 8 (ధనాధన్ న్యూస్): పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, దళిత ఉద్యమ నాయకుడు కు తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా ప్రచార కార్యదర్శి, మాజీ ఎమ్మార్పీఎస్ శంకరపట్నం మండల శాఖ అధ్యక్షుడు అంతడుపుల సతీష్ మాదిగ మంగళవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని మందకృష్ణ మాదిగ నివాసానికి వెళ్లిన సతీష్ మాదిగ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సతీష్ మాదిగ మాట్లాడుతూ, దళిత వర్గాల హక్కుల సాధన కోసం మూడు దశాబ్దాలకు పైగా నిరంతర పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. దళితుల సామాజిక, రాజకీయ, ఆర్థిక అభ్యున్నతికి ఆయన చేసిన కృషి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.పద్మశ్రీ పురస్కార గ్రహీతగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మందకృష్ణ మాదిగ మరిన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా, ఆయురారోగ్యాలతో ఉండి దళిత సమాజానికి మార్గదర్శకుడిగా సేవలందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
