
దామెర, ధనాధన్ న్యూస్: దామెర మండలం సింగరాజుపల్లి గ్రామంలో రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో రోడ్డు ప్రక్కన పడుకుని ఉన్న వృద్ధురాలిని చూసి చలించిపోయిన దామెర ఎస్సై,మరుసటి రోజు ఉదయం ఆమె వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకొని వృద్దురాలికి బేడ్ ట్లు,టవల్స్,పండ్లు,నిత్యావసర సరుకులతో పాటు రూ.3,000 నగదు అందజేసి మానవత్వాన్ని చూపారు. వృద్ధురాలి వైద్య చికిత్వకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.దామెర ఎస్సై వీరభద్రరావు మానవత్వాన్ని పలువురు అభినందించారు.
