ప్రొఫెసర్ కోదండరాం ని సన్మానించిన విద్యార్థి నాయకులు..

By dhanadhannews.com

-ఉద్యమకారులను గౌరవించిన తెలంగాణ ప్రభుత్వం.

-తెలంగాణ ఉద్యమకారుల ప్రతినిధి ప్రొఫెసర్ కోదండరాం.

హుజురాబాద్ పట్టణానికి విచ్చేసిన తెలంగాణ ఉద్యమ రథసారధి ప్రొఫెసర్ కోదండరాం నూతనంగా ఎమ్మెల్సీ గా నియామకం అయిన సంధర్భంగా తెలంగాణ ఉద్యమకారులు అన్నం ప్రవీణ్ బృందం అధ్వర్యంలో ఆత్మీయ సన్మానంతో సత్కరించడం జరిగింది.తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకులు అన్నం ప్రవీణ్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించింది ఉద్యమకారులేనని, వారి పాత్ర మరువలేనిదని అన్నారు. తెలంగాణ ఉద్యమ ఘట్టంలో అన్నీ పార్టీలను ఏకం చేసి జేఏసీ ఏర్పాటుతో యావత్తు తెలంగాణ సమాజాన్ని ఏకతాటి పైకీ తెచ్చి తెలంగాణ వాదనను కేంద్ర ప్రభుత్వానికి తెలుపడంలో కీలక గొంతుగా నిలబడ్డ ఉద్యమ స్పూర్తి ప్రొఫెసర్ కోదండరాం కి ఎమ్మెల్సీ గా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.తెలంగాణ ఉద్యమకారులందరికీ దక్కిన గౌరవంగా భావిస్తున్నామని అన్నం ప్రవీణ్ తెలిపారు.తెలంగాణ అమరవీరుల, ఉద్యమకారుల, త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ, అమరవీరుల కుటుంబాలను, ఉద్యమాకారులను అత్యంత దారుణంగా నిర్లక్ష్యం చేసింది., నియంత పాలన కొనసాగించింది., కానీ ఇప్పుడు ప్రజా తీర్పుతో ఏర్పడ్డ ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారుల పక్షపాతి‌గా తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇచ్చి గొప్పగా గౌరవించిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నం ప్రవీణ్ తెలిపారు.
తెలంగాణకు రక్షణ కవచంగా ఉండే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అనీ, తెలంగాణ ఉద్యమకారులంతా కాంగ్రెస్ పార్టీకీ అండగా నిలబడాలని అన్నం ప్రవీణ్ కోరారు.ఈ కార్యాక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు అన్నం ప్రవీణ్, విద్యార్థి నాయకులు కారింగుల రాజేందర్, బుడిగె శ్రీకాంత్, యేబూషి అజయ్, ఇటుకాల గణేష్, బిజిగిరి శ్రీకాంత్, కార్తీక్, సాయి, ప్రశాంత్, దీపక్, బాను, దిలీప్, సన్ని తదితరులు పాల్గొన్నారు.