- హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసి చైర్మన్
కవ్వ లక్ష్మారెడ్డి
సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని సర్వాయిపేట,పెర్కపల్లి,
ఆకునూరు,వెంకటేశ్వర్లపల్లి,ఘనపూర్,రాయికల్ గ్రామాల్లో స్వశక్తి సంఘాలు,జేఏసీ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్ర రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు విధ్య తో పాటు విలువలు నేర్పాలని హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసి చైర్మన్
కవ్వ లక్ష్మారెడ్డి అన్నారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో డ్రగ్స్ నిర్మూలన పై వడ్లకొండ అనిల్ కుమార్ కళాకారుల బృందం డ్రగ్స్,గుట్కాలు,సామాజిక చైతన్య గీతాలతో అలరించారు.రాయికల్ గ్రామంలో పలువురు మాట్లాడుతూ గ్రామాల్లోకి డ్రగ్స్ రాకుండా పిల్లలు,యువత దాని బారిన పడకుండా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలని,కుటుంబాన్ని గ్రామాన్ని,డ్రగ్స్ రహిత గ్రామంగా చేయాలని ప్రతిజ్ఞ చేశారు.అనంతరం నినాదాలతో ర్యాలీ తీశారు.ఇక్కడ జేఏసి కో ఆర్డినేటర్ డ్యాగల సారయ్య, పద్మ,శ్రీదేవి,సింగ్,ప్రవీణ్, రవీందర్ రెడ్డి,కుమారస్వామి,ఆశీర్వాదం,ప్రభాకర్,వెంకన్న,సీసీలు అనపురం రమేశ్,శ్రీనివాస్ రెడ్డి, బైరీ జమున,పూదరి రాజేశ్వరి,విఓఏ లు ఏనుగుల రజిత,బ బత్తులచెంద్రకల,చిట్టి వాణిశ్రీ,శనిగరపు రజిత,వోలాద్రి రజిత, సబ్బని సువర్ణ,ఈదులకంటి అనిత,ఆయా గ్రామాల అధ్యక్షులు,పాలకవర్గ సభ్యులు,లీడర్లు,స్వశక్తి సంఘాల సభ్యులు,హెల్త్ సిబ్బంది,ఫిల్డ్ అసిస్టెంట్లు,కళాకారులు,గ్రామ పెద్దలు,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
