ఈదురు గాలులతో నేలకొరిగిన మక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి
కుమ్మేర ఘటనపై రజకసంఘం నిరసన
“పసిప్రాణం ప్రశ్నిస్తోంది: సమానత్వం ఎక్కడనీ?”
గురువు ఆశీస్సులతో ప్రజాసేవ బాటలోకి అరికిల్ల స్రవంతి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం శిష్యురాలు అరికిల్ల స్రవంతి తన రాజకీయ ప్రయాణంలో మరో కీలక అడుగు వేశారు.జమ్మికుంట మున్సిపాలిటీ 24వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంగా శనివారం ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తన రాజకీయ గురువు ప్రొఫెసర్ కోదండరాంను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ,జనసమితి పార్టీ ఆవిర్భావం నుంచే స్రవంతి పార్టీకి వెన్నెముకలా నిలిచిందని అన్నారు.కార్యకర్త స్థాయి నుంచి ప్రారంభమైన […]
జర్నలిస్టులను అరెస్టు చేయడం అన్యాయం

టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కోకన్వీనర్ కే బాపురావు కరీంనగర్/ధనాధన్ న్యూస్:ఎన్టీవీ మీడియాలో ఒక మహిళా ఐఏఎస్ అధికారిపై ప్రసారమైన కథనంపై ఎటువంటి విచారణ చేయకుండా, ముందస్తు నోటీసు ఇవ్వకుండా సిట్ పోలీసులు ఓ ముగ్గురు సీనియర్ జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) తీవ్రంగా ఖండించింది. ఎన్టీవీలో వచ్చిన కథనానికి జర్నలిస్టులు దొంతు రమేశ్, పరిపూర్ణ చారి, సుధీర్ లను బాధ్యులను చేస్తూ ‘సిట్’ పోలీసులు ముందస్తునోటీసులు ఇవ్వకుండా నేరుగా అరెస్టు చేయడం దారుణమని […]
సీనియర్ జర్నలిస్ట్ మండల యాదగిరికి
రాష్ట్రస్థాయి సర్వోత్తమ సేవ పురస్కారం

హుజురాబాద్ /ధనాధన్ న్యూస్:కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ మండల యాదగిరిని రాష్ట్రస్థాయి సర్వోత్తమ సేవ పురస్కారంతో ఘనంగా సత్కరించారు. గత 30 సంవత్సరాలుగా పత్రికా రంగంలో ఆయన అందిస్తున్న నిస్వార్థ, విశిష్ట సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు.మానవ విలువల పరిరక్షణ సేవా సంస్థ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ప్రజాకవి నాగుల సత్యం గౌడ్ ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతి మెయిన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో పలు […]
ప్రజా ప్రతిభ క్యాలెండర్ ఆవిష్కరణ

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ పట్టణంలో ప్రజా ప్రతిభ క్యాలెండర్‌ను హుజురాబాద్ ఆర్.సి రిపోర్టర్ ఇప్పకాయల సాగర్ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ టౌన్ సిఐ టీ.కరుణాకర్, మున్సిపల్ కమిషనర్ కె.సారపు సమ్మయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పత్రికా విలేకరులు ప్రభుత్వానికి,ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల శ్రేయస్సు దిశగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత వహించాలని పేర్కొన్నారు.అలాగే ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తూ సమాజంలో పత్రికలు కీలక పాత్ర […]
మన వార్త దినపత్రిక క్యాలండర్ ఆవిష్కరణ

జమ్మికుంట/ధనాధన్ న్యూస్ జనవరి 07 :మన వార్త దినపత్రిక నూతన సంవత్సరం 2026 క్యాలండర్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జమ్మికుంటలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ,పత్రిక ప్రజలకు–అధికారులకు మధ్య వారధిగా పనిచేస్తుందని అన్నారు. సమాజానికి అవసరమైన వార్తలు, సమాచారాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు చేరవేస్తూ, నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ అనతికాలంలోనే విశేష ప్రాచుర్యం పొందిన మన వార్త దినపత్రిక యాజమాన్యాన్ని, సిబ్బందిని అభినందించారు.ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో […]
హుజురాబాద్,జమ్మికుంట మున్సిపల్ పోరులో కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతున్నాం: ప్రణవ్

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, పట్టణాల అభివృద్ధిలో రాష్ట్రంలోనే టాప్ మున్సిపాలిటీలుగా నిలుస్తాయని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ధీమా వ్యక్తం చేశారు.హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, పట్టణాల అభివృద్ధిలో రాష్ట్రంలోనే టాప్ మున్సిపాలిటీలుగా నిలుస్తాయని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం హుజురాబాద్ […]
