గడ్డం సమ్మయ్య కి దళిత రత్న అవార్డు

హుజూరాబాద్/ధనాధన్ న్యూస్: హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా దళిత రత్న అవార్డు ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించబడింది.మహనీయులు బాబు జగజీవన్ రామ్ మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ బైరి వెంకటేశం ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఎస్సీ 52 కులాల సంఘం అధ్యక్షుడు రైళ్ల లక్ష్మీ నరసయ్య కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా హుజురాబాద్ ఇందిరానగర్‌కు చెందిన […]

తెలంగాణ జన సమితి పార్టీ 4వ ప్లీనరీ విజయవంతం చేయండి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్ మే 02: తెలంగాణ జన సమితి (TJS) పార్టీ 4వ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు పిలుపునిచ్చారు. శనివారం హుజురాబాద్ పట్టణంలో ప్లీనరీకి సంబంధించిన వాల్ పోస్టర్‌ను పార్టీ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ముక్కెర రాజు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో నిత్యం పోరాడుతున్న ఏకైక పార్టీ తెలంగాణ జన సమితి అని […]

సైదాపూర్‌లో అభివృద్ధి పనులపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం

సైదాపూర్/ధనధాన్ న్యూస్ ఏప్రిల్ 28: సైదాపూర్ మండలంలోని విశాల సహకార ప్రకృతి సంఘం ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. అనంతరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల వారీగా పెండింగ్ పనులు, అభివృద్ధి కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని కార్యకర్తలకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెంచేందుకు […]

పోషణ్ పక్వాడ ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహణ

సైదాపూర్/ధనధాన్ న్యూస్,ఏప్రిల్ 25:కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెంకేపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ పక్వాడ ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐసిడిఎస్ సీడీపీవో ఎం. సుగుణ మాట్లాడుతూ, ప్రీ-స్కూల్ మేళ, గర్భిణి స్త్రీల కోసం శ్రీమంతం కార్యక్రమాలు ఎంతో వైభవంగా నిర్వహించామని తెలిపారు. అలాగే ఆరు నెలలు నిండిన శిశువులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించడంతో పాటు, చిన్నారుల కోసం గ్రాడ్యుయేషన్ డేను కూడా విజయవంతంగా జరిపినట్లు వెల్లడించారు. ఈ […]

ఘనంగా డా.బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు

సైదాపూర్/ధనాధన్ న్యూస్ ఏప్రిల్ 14:సైదాపూర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ గుర్రాల స్వతంత్ర ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా డా. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, ఛత్రపతి శివాజీ విగ్రహాలకు కూడా పూలమాలలు సమర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ గుర్రాల స్వతంత్ర మాట్లాడుతూ, చిన్ననాట కుల వివక్షను ఎదుర్కొన్నప్పటికీ డా. […]

జాతీయ రోడ్డు భద్రత మనందరి బాధ్యత: సర్పంచ్ గుర్రాల స్వతంత్ర

సైదాపూర్/ధనాధన్ న్యూస్ ఏప్రిల్ 13:సైదాపూర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణలో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గుర్రాల స్వతంత్ర ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాపాయానికి దారి తీస్తుందని హెచ్చరించారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, పొల్యూషన్ సర్టిఫికెట్ వంటి అవసరమైన పత్రాలను […]

వి.ఎస్.ఆర్ డిగ్రీ కళాశాలలో ఘనంగా వార్షిక సాంస్కృతికోత్సవాలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ మండలం సింగాపురం గ్రామంలోని వి.ఎస్.ఆర్ డిగ్రీ కళాశాలలో వార్షిక సాంస్కృతికోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణం విద్యార్థుల కళా ప్రదర్శనలతో కళకళలాడింది. విద్యార్థులు నృత్యాలు, సంగీతం, నాటికలు వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరించారు. కార్యక్రమంలో భాగంగా అతిథుల ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన ప్రముఖులు, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించడంతో పాటు వారి ప్రతిభ, […]

ప్రజల సమస్యల పరిష్కారానికి “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” గ్రామసభ

జమ్మికుంట/ధనాధన్ న్యూస్:పెద్దంపల్లి గ్రామంలో సర్పంచ్ ఎగిత పద్మ కుమార్ అధ్యక్షతన “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” గ్రామసభను ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజల సమస్యలను గుర్తించి వాటికి తక్షణ పరిష్కారాలు చూపించడం ఈ సమావేశం ప్రధాన లక్ష్యంగా నిలిచింది.ఈ సందర్భంగా సర్పంచ్ ఎగిత పద్మ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికను రాష్ట్రవ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేస్తున్నదని తెలిపారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని, […]

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వెంకటేశ్వర్లపల్లిలో గ్రామ సభ

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో గురువారం గ్రామ సర్పంచ్ రాయిచెట్టి చంద్రయ్య ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ రాయిచెట్టి చంద్రయ్య మాట్లాడుతూ గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామానికి తాజాగా 27 కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. అలాగే వితంతు, వికలాంగులు, వృద్ధాప్య పింఛన్లు అర్హులందరికీ అందేలా […]

డంపింగ్ యార్డు స్థల మార్పిడికి కట్టుబడి ఉన్నాం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన డంపింగ్ యార్డు స్థలాన్ని మార్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ తెలిపారు. గురువారం పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తన ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందని ఆరోపిస్తూ, ఆయనను వెంటనే ఎమ్మెల్యే పదవి నుంచి భర్తరఫ్ చేయాలని ప్రణవ్ డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో రీల్స్, లైకులు పొందడానికే పరిమితమై, ప్రజా సమస్యల […]