హుజూరాబాద్‌లో మున్సిపల్ కార్మికుల నిరసన – లేబర్ కోడ్ల రద్దు కోరుతూ ఆందోళన

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్‌లో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని అటెండెన్స్ పాయింట్ వద్ద మున్సిపల్ కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ ఆందోళన చేపట్టారు.


ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అలాగే 2021 సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను హరించే విధంగా ఉన్న ఈ చట్టాలను వెంటనే రద్దు చేయాలని కోరారు.


ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు ఎండి అజ్జూ, ప్రధాన కార్యదర్శి బోరగల కుమార్ (రాజు), ఉపాధ్యక్షులు రసపెల్లి సరోజన, రసపెల్లి క్రాంతి కుమార్, అన్నపూర్ణ, కోశాధికారి రామగిరి సులోచన, సహాయ కార్యదర్శి రొంటాల రాజేశ్వరి, కొలుగురి కుమార్, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ సతీష్, ప్రచార కార్యదర్శి జెల్ల రాజేష్, సభ్యులు రెంటాల భాగ్య, మహేష్, బండ స్వామి, వినోద్, బొరగాల బొండయ్య, సుశీల తదితరులు పాల్గొన్నారు.
కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై తమ డిమాండ్లను గట్టిగా వినిపించారు.

Leave a comment