జమ్మికుంట,ఆగస్టు 5 (ధనాధన్ న్యూస్): అర్హులైన ప్రతి లబ్ధిదారునికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ తెలిపారు.బుధవారం జమ్మికుంట పట్టణంలోని 2, 3, 4, 5, 6, 7, 8, 10, 11, 14, 15, 24, 28 వార్డుల్లో నిర్వహించిన “ప్రతి గడపకు సంక్షేమం – ప్రజల వద్దకే సీఎంఆర్ఎఫ్ చెక్కులు” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 22 మంది లబ్ధిదారులకు రూ.8 లక్షలకు పైగా విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను నేరుగా వారి ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ, అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. ప్రతి అర్హుడికి ఈ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేయడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు.


చెక్కులు అందుకున్న పలువురు లబ్ధిదారులు భావోద్వేగానికి గురికాగా, వారికి ధైర్యం చెబుతూ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రణవ్ భరోసా ఇచ్చారు. వార్డుల పర్యటన సందర్భంగా ప్రజలు తమ సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, జిల్లా అధికార ప్రతినిధులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్, వార్డు అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, బ్లాక్ కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, సేవాదళ్, అనుబంధ సంఘాల నాయకులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply