- హెచ్చరిక బోర్డులు లేక డ్రైనేజీ పనులు – కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యంపై సీపీఐ ఆగ్రహం
- సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు పైడిపల్లి రాజు

కరీంనగర్/ధనాధన్ న్యూస్,జూన్ 23: కరీంనగర్ నగరంలోని 40వ డివిజన్ హనుమాన్‌నగర్‌లో డ్రైనేజీ నిర్మాణ పనుల కోసం రహదారి పక్కన గుంతలు తవ్వి, ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకుండా వదిలేయడం కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి నిదర్శనమని సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు పైడిపల్లి రాజు విమర్శించారు.
బ్లూబెల్స్ పాఠశాల సమీపంలోని సందు రహదారి వెంట డ్రైనేజీ పనులు చేపట్టి, ప్రజలకు హెచ్చరికలు లేకుండా వదిలేయడం పూర్తిగా బాధ్యతారాహిత్యమని ఆయన పేర్కొన్నారు. ప్రతిరోజూ వందలాది మంది విద్యార్థులు, స్థానిక ప్రజలు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుండగా కనీస భద్రతా చర్యలు తీసుకోకపోవడం ఆందోళనకరమన్నారు.
రోడ్డు తవ్వకాల వద్ద ప్రతిబింబించే (షైనింగ్) హెచ్చరిక బోర్డులు, బ్యారికేడ్లు ఏర్పాటు చేయకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ విషయంలో మున్సిపల్ అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
రోడ్డు తవ్విన ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రజలకు ఏదైనా అపాయం సంభవిస్తే పూర్తి బాధ్యత కాంట్రాక్టర్‌దేనని హెచ్చరించారు.వెంటనే హెచ్చరిక బోర్డులు, భద్రతా ఏర్పాట్లు చేయాలని,లేనిపక్షంలో సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని పైడిపల్లి రాజు ఒక ప్రకటనలో తెలిపారు.