ఘనంగా డా.బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు

సైదాపూర్/ధనాధన్ న్యూస్ ఏప్రిల్ 14:సైదాపూర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ గుర్రాల స్వతంత్ర ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా డా. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, ఛత్రపతి శివాజీ విగ్రహాలకు కూడా పూలమాలలు సమర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ గుర్రాల స్వతంత్ర మాట్లాడుతూ, చిన్ననాట కుల వివక్షను ఎదుర్కొన్నప్పటికీ డా. … Read more

జాతీయ రోడ్డు భద్రత మనందరి బాధ్యత: సర్పంచ్ గుర్రాల స్వతంత్ర

సైదాపూర్/ధనాధన్ న్యూస్ ఏప్రిల్ 13:సైదాపూర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణలో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గుర్రాల స్వతంత్ర ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాపాయానికి దారి తీస్తుందని హెచ్చరించారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, పొల్యూషన్ సర్టిఫికెట్ వంటి అవసరమైన పత్రాలను … Read more

వి.ఎస్.ఆర్ డిగ్రీ కళాశాలలో ఘనంగా వార్షిక సాంస్కృతికోత్సవాలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ మండలం సింగాపురం గ్రామంలోని వి.ఎస్.ఆర్ డిగ్రీ కళాశాలలో వార్షిక సాంస్కృతికోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణం విద్యార్థుల కళా ప్రదర్శనలతో కళకళలాడింది. విద్యార్థులు నృత్యాలు, సంగీతం, నాటికలు వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరించారు. కార్యక్రమంలో భాగంగా అతిథుల ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన ప్రముఖులు, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించడంతో పాటు వారి ప్రతిభ, … Read more

ప్రజల సమస్యల పరిష్కారానికి “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” గ్రామసభ

జమ్మికుంట/ధనాధన్ న్యూస్:పెద్దంపల్లి గ్రామంలో సర్పంచ్ ఎగిత పద్మ కుమార్ అధ్యక్షతన “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” గ్రామసభను ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజల సమస్యలను గుర్తించి వాటికి తక్షణ పరిష్కారాలు చూపించడం ఈ సమావేశం ప్రధాన లక్ష్యంగా నిలిచింది.ఈ సందర్భంగా సర్పంచ్ ఎగిత పద్మ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికను రాష్ట్రవ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేస్తున్నదని తెలిపారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని, … Read more

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వెంకటేశ్వర్లపల్లిలో గ్రామ సభ

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో గురువారం గ్రామ సర్పంచ్ రాయిచెట్టి చంద్రయ్య ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ రాయిచెట్టి చంద్రయ్య మాట్లాడుతూ గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామానికి తాజాగా 27 కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. అలాగే వితంతు, వికలాంగులు, వృద్ధాప్య పింఛన్లు అర్హులందరికీ అందేలా … Read more

పట్టభద్రులకు,ప్రభుత్వానికి వారధిగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వూట్కూరి నరేందేర్ రెడ్డి భారీ మెజారిటీతో మండలికి వెళ్లడం ఖాయమని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.ఆదివారం రోజున హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ కన్వెన్షన్ హాల్ లో జరిగిన ఆత్మీయ సమ్మేళనం సభకు ఆయన ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి తో పాటు హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ పట్టభద్రులు ఓటును వృధా చేసుకోవద్దని,ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా … Read more

సగర సంఘ సేవలు అభినందనీయం

వీణవంక/ధనాధన్ న్యూస్: సగర సంఘం సేవలు అభినందనీయమని హన్మకొండ పట్టణానికి చెందిన ప్రముఖ నేత్ర వైద్య నిపుణుడు డాక్టర్ గుండేటి గణేష్ అన్నారు.సగర సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ట రాజు కోరిక మేరకు మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలోని సగర సంఘ కార్యాలయంలో సగర సంఘం నేతృత్వంలో హన్మకొండలోని గణేస్ ఐ కేర్ అండ్ ఆఫ్టికల్స్,సాయితేజ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శనివారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాస్ … Read more

కాంగ్రెస్ ప్రభుత్వంలోనే దళితులకు న్యాయం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే బలహీనవర్గాలకు న్యాయం జరుగుతుందని,దళిత బంధు నిధుల విడుదల ద్వారా మరోసారి అది రుజువైందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ అన్నారు.శనివారం  రోజున ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెండేళ్లు ఎమ్మెల్సీగా,ప్రభుత్వ విప్ గా ఉన్న కౌశిక్ రెడ్డి దళిత బంధు నిధులు విడుదల చేయడానికి ఎందుకు ప్రయత్నించలేదని ప్రశ్నించారు.దళితుల భావోద్వేగాలను రెచ్చగొట్టి దళితులతో దళిత బంధు రాజకీయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.గత … Read more

ఆకునూరు గ్రామపంచాయతీలో డి.ఎల్.పి.ఓ విచారణ

సైదాపూర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపుర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో నూతన గ్రామపంచాయతీ నిర్మాణంలో, స్మశాన వాటికల పనుల్లో అప్పటి  పలు అవకతవకలు జరిగాయని అదే గ్రామానికి చెందిన రావుల రాజిరెడ్డి అనే వ్యక్తి డిసెంబర్ 24న కరీంనగర్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.ఈ విషయంపై హుజురాబాద్ ఇన్చార్జి  డి.ఎల్.పి.ఓ శ్రీనివాస్ ఫిర్యాదు దారుడితోపాటు,మాజీసర్పంచ్ రమణ రెడ్డిని పిలిపించుకొని విచారణ చేపట్టారు.విచారణ చేసిన నివేదికను పై అధికారులకు అందజేస్తానని డి ఎల్ పి ఓ  పేర్కొన్నారు.ఈ … Read more

సామాజిక కార్యకర్త ముసుగులో బ్లాక్ మెయిల్

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: సామాజిక కార్యకర్త ముసుగులో అనేక బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న సాబీర్ ఆలీ  పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేష్ అన్నారు. జమ్మికుంట పట్టణంలో గల ప్రెస్ క్లబ్ భవనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ సాబీర్ అలీ బ్లాక్మెయిల్ చేస్తూ  ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నీరుగారిస్తున్నారని అన్నారు. దళితులకు రక్షణ కవచంగా ఉన్న … Read more