ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నాం

జగిత్యాల/ధనాధన్ న్యూస్, జూన్ 17:ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజల స్వంతింటి కల నెరవేర్చుతున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.కొండాపూర్ గ్రామానికి మంజూరైన ఇందిరమ్మ ఇళ్లలో 9 ఇళ్ల పూర్తి కాగా బుధవారం గృహ ప్రవేశాలు నిర్వహించారు. గృహప్రవేశ వేడుకలకు హాజరైన మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో […]
మాల సంక్షేమ సంఘం సర్వాయిపేట గ్రామ పంచాయతీ అధ్యక్షుడిగా దొంత హరీష్ ఏకగ్రీవ ఎన్నిక

సైదాపూర్/ధనాధన్ న్యూస్,జూన్ 14: సైదాపూర్ మండలంలోని సర్వాయిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వాయిపేట, శివరాంపల్లి జంట గ్రామాల మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా దొంత హరీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘ సభ్యులు, పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.సంఘ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని, మాల సంఘం సంక్షేమం, ఐక్యత, పురోగతి కోసం నిరంతరం పనిచేస్తానని హరీష్ పేర్కొన్నారు. సంఘ సభ్యులందరి సహకారంతో గ్రామాల్లో సామాజిక, […]
అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

బుగ్గారం/ధనాధన్ న్యూస్ జూన్ 9:జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రానికి చెందిన కౌలు రైతు, దళిత రైతు మానాల పెద్ద దుబ్బయ్య (60) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. కౌలుకు తీసుకున్న పొలాల సమీపంలోనే ఆయన మృతదేహం లభించింది. కుటుంబ సభ్యులు, బుగ్గారం ఎస్సై జి. సతీష్ తెలిపిన వివరాల ప్రకారం, పెద్ద దుబ్బయ్య పలువురు రైతుల భూములను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. అయితే ఇటీవల […]
మృగశిర కార్తిలో చేపల కోసం నిరీక్షణ.. నిరాశతో వెనుదిరిగిన ప్రజలు

సైదాపూర్/ధనాధన్ న్యూస్ జూన్ 8: సైదాపూర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో మృగశిర కార్తి సందర్భంగా సోమవారం గ్రామ చెరువులో చేపల వేట నిర్వహించారు. చేపలు లభిస్తాయనే ఆశతో ఆకునూరు గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు చెరువు వద్దకు తరలివచ్చారు. అయితే ఆశించిన మేర చేపలు దొరకకపోవడంతో దాదాపు 500 మందికి పైగా ప్రజలు నిరాశతో, ఆగ్రహంతో వెనుదిరిగారు.ప్రజలు మాట్లాడుతూ ఉదయం నుంచే చెరువు వద్ద వేచి ఉన్నప్పటికీ సాయంత్రం నాలుగు గంటల […]
గ్యాస్ ధరల పెంపుపై కాంగ్రెస్ ఆగ్రహం – కరీంనగర్‌లో వంటా-వార్పు

కరీంనగర్/ధనాధన్ న్యూస్ జూన్ 8: కేంద్రంలోని ఎన్డీఏ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల ఎల్‌పీజీ గ్యాస్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ నగరంలోని ఇందిరా చౌక్ వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఖాళీ గ్యాస్ సిలిండర్లు, బీజేపీ వ్యతిరేక నినాదాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ కట్టెల పొయ్యిపై వంట చేస్తూ కాంగ్రెస్ నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి […]
మృగశిర కార్తె సందర్భంగా ఉచిత ఆయుర్వేద మందు పంపిణీ

జగిత్యాల/ధనాధన్ న్యూస్ జూన్ 8: జిల్లా కేంద్రంలోని చింతకుంట చెరువు సమీపంలో ఉన్న శ్రీ సూర్య భగవాన్ ధన్వంతరి ఆలయంలో మృగశిర కార్తె సందర్భంగా భక్తులకు మృగశిర ఆయుర్వేద ఔషధాన్ని ఉచితంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, మృగశిర కార్తె రోజున ఈ ఔషధాన్ని సేవించడం వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, జలుబు, దగ్గు, ఆస్తమా, ఈసినోఫిలియా తదితర అలర్జీ సమస్యల నుంచి ఉపశమనం లభించడమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. […]
అంతర్గాంలో మహిళలకు ఉచిత ఆటో ప్రయాణ సేవ ప్రారంభం

జగిత్యాల/ధనాధన్ న్యూస్ జూన్ 8: జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామంలో సర్పంచ్ కంటెస్టెడ్ అభ్యర్థి కోల భవాని-అరుణ్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మహిళల కోసం ఉచిత ఆటో ప్రయాణ సేవను సోమవారం ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మహిళలకు ఉచిత ఆటో ప్రయాణ సేవను ప్రారంభించి మాట్లాడారు. మహిళల సంక్షేమం, సౌకర్యాల కల్పనకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మహిళల […]
తెలంగాణ ఉద్యమకారుడు పులిగారి చంద్రశేఖర్ రెడ్డికి ఘన నివాళి

వికారాబాద్/ధనాధన్ న్యూస్ జూన్ 8: తెలంగాణ ఉద్యమకారుడు, వికాస్ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ దివంగత పులిగారి చంద్రశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా సోమవారం వికాస్ జూనియర్ కళాశాల ఆవరణలో ఘనంగా నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి తెలంగాణ ఉద్యమకారులు, కళాశాల సిబ్బంది, మున్నూరు సోమారం గ్రామ నాయకులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పులిగారి చంద్రశేఖర్ రెడ్డి చేసిన సేవలను స్మరించుకున్నారు. సమాజ సేవతో పాటు విద్యా రంగ […]
దివంగత మిత్రుని కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం

హుస్నాబాద్/ధనాధన్ న్యూస్,జూన్ 7: స్నేహం అంటే కేవలం కలిసి చదవడం, కలుసుకోవడం మాత్రమే కాదని, కష్టకాలంలో ఒకరికొకరు అండగా నిలవడమేనని హుస్నాబాద్ గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థులు మరోసారి నిరూపించారు.సైదాపూర్ మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి చెందిన బొడిగ తిరుపతి గత నెల 24న అనారోగ్యంతో అకాల మరణం చెందగా,ఆయన కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు తోటి పూర్వ విద్యార్థులు ముందుకొచ్చారు.1996–2016 మధ్య హుస్నాబాద్ గురుకుల పాఠశాలలో తిరుపతితో కలిసి చదువుకున్న స్నేహితులు నిజాం కళాశాల ప్రొఫెసర్ వేల్పుల […]
ప్రజా భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం

వికారాబాద్/ధనాధన్ న్యూస్,జూన్ 06: వికారాబాద్ పట్టణంలోని అనంతగిరిపల్లి 10వ వార్డులో నిర్వహించిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. మున్సిపాలిటీ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో ప్రజల భాగస్వామ్యాన్ని నిర్ధారించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.వార్డు సభల ద్వారా స్థానిక సమస్యలను గుర్తించడం, అభివృద్ధి పనులను సూచించడం, సమగ్ర వార్డు అభివృద్ధి ప్రణాళిక రూపొందించడంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం […]
